మహిళలపై పోలీసుల అత్యుత్సాహాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

– మహిళా పోలీసులకు యూనిఫాంలు కుట్టించేందుకు కొలతల కోసం మగ టైలర్లను తీసుకోవడం దారుణమైన చర్య.
– మాజీ మంత్రి పీతల సుజాత

వైసీపీ ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. సాధారణ మహిళలకే కాకుండా వాళ్లకు రక్షణ కల్పించే మహిళా పోలీసులకు సైతం జగన్ రెడ్డి రక్షణ కల్పించలేకపోతున్నారు. తాజాగా విజయనగరం బొబ్బిలి పారిశ్రామికవాడ మైథాన్ పరిశ్రమలో ఉపాధి కల్పించాలని స్థానికులు పరిశ్రమ ఎదుట నిరసనలు తెలియజేస్తుంటే పోలీసులు అత్యుత్సాహంతో మహిళలు సొమ్మసిల్లిపడిన పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్లకు న్యాయం చేయమని, ఉపాధి కల్పించమని మహిళలు అడగటం తప్పా?

నిరసనలు తెలియజేయడం తప్పా? మహిళలను అని కూడా చూడకుండా పోలీసులు నెట్టివేయడం హేయం. వాళ్లకు ఏమైనా అయితే సమాధానం ఎవరు చెబుతారు? నిన్న నెల్లూరు జిల్లాలో గ్రామ సచివాలయం మహిళా పోలీసులకు యూనిఫాంలు కుట్టించేందుకు కొలతల కోసం మగ టైలర్లను తీసుకోవడం దారుణమైన చర్య. నెల్లూరు జిల్లాలో ఒక్క మహిళా టైలర్లు కనపడలేదా? అదే విధంగా ఎవరైతే మగ టైలర్ల చేత కొలతలు తీయించేందుకు అనుమతినిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోకుండా ఫోటీలు తీసిన వ్యక్తులపై అక్రమ కేసులు బనాయించడం హేయం. వెంటనే ఆ కేసులన్నింటిని విత్ డ్రా చేయాల్సిందిగా టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం.

చంద్రబాబు నాయుడు మహిళలను అన్ని విధాలుగా ఆదుకున్నారు. మహిళలకు ఆస్థి హక్కు కల్పించి తలెత్తునే విధంగా చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అయితే నేడు మహిళలు తలదించుకునే పాలన చేస్తున్న చేస్తున్న చరిత్ర జగన్ రెడ్డికే దక్కుతుంది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా హోం మంత్రి ఉండి ఏం చేస్తున్నారు? ఏ మహిళా వైసీపీ నాయకులు ఖండిచలేరా? మహిళలను ఆత్మగౌరవంతో బ్రతకనివ్వరా?

అత్యాచారాలు జరిగిన ఒక్క మహిళలకు జగన్ రెడ్డి న్యాయం చేయలేకపోయారు? సీఎం ఇంటికి కూత వేటు దూరంలో ఒక మహిళపై అత్యాచారం జరిగితే వెంకట్ రెడ్డి అనే నిందితుడుని ఇంత వరకు పట్టుకొని అరెస్ట్ చేయలేకపోయారు? ఏ అతను మీ సామాజిక వర్గానికి చెందినవాడనా? రాజమండ్రిలో ఒక మైనర్ బాలికను

గ్యాంగ్ రేప్ చేసి దశ లేని దిశ పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే వైసీపీ నేతలు నిందులని తెలిసి కూడా అరెస్ట్ చేయలేదు. ఇదేనా మీరు మహిళలకు చేసే న్యాయం. మహిళలు ధైర్యంగా తిరిగే పరిస్థితి లేదు. క్యాసినో అనే కొత్త సంస్కృతిని తీసుకొని మహిళలను దిగజార్చారు.

మూడేళ్లగా మహిళలకు ఏం చేశారు. పట్టపగలు మహిళలు బయట తిరిగే పరిస్థితి రాష్ట్రంలో ఉందా? ఆడబిడ్డను భయటకు పంపిస్తే ఏ అరాచకుడు ఏం చేస్తాడో అని తల్లిదండ్రులు బ్రతుకుతున్న పరిస్థితి కల్పించారు. ఎన్నికల ముందు తలలు నిమురుతూ ముద్దులు పెడుతూ మేనమామగా ఉంటారని హామీనిచ్చారు. ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా గన్ కంటే ముందుగా ఉంటానన్నారు. కాని నేడు ఇంత మంది మహిళలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకునే పాపాన పోలేదు. జగన్ రెడ్డి తీరు మార్చుకోకపోతే మహిళలందరు కలిసి తగిన సమయంలో బుద్ధి చెబుతాం.

Leave a Reply