Suryaa.co.in

Telangana

రేవంత్..గజినీ అయ్యావా?గతం మరిచిపోయావా?

– రైతు దీక్ష లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి
– చనిపోయిన రైతుల కుటుంబాల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించిన బీజేపీ నేతలు

హైదరాబాద్ వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ సమక్షంలో కేవలం అధికారంలో వచ్చేందుకు రైతులను ఆదుకుంటామని రేవంత్ హామీ ఇచ్చారు. దాదాపు 81 వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి ఏటా రైతులను ఆదుకుంటామని చెప్పిన మాట మరిచిపోయారా? మరిచిపోయినట్లు నటిస్తున్నారా?

రేవంత్ గజినీ అయ్యావా? గతం మరిచిపోయావా? 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 40 వేల కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. కేబినెట్ లో 31 వేల కోట్లు అని నిర్ణయం తీసుకున్నారు.. బడ్జెట్ లో 26 వేల కోట్లు ఇచ్చి 17 వేల కోట్లు రిలీజ్ చేశారు. రాష్ట్రంలో రెండో వంతు రైతులను మోసం చేశారు.

కాంగ్రెస్ అధికారంలో వచ్చాక 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జూలై 30 వరకు 870 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సెప్టెంబర్ 30 వరకు లెక్క మొత్తం 1000 కి చేరింది. రైతులు ఓట్లేస్తే కాంగ్రెస్ గద్దెను ఎక్కింది. కేవలం రైతులు ఉన్నచోటనే కాంగ్రెస్ గెలిచింది. వాళ్ళను గెలిపించిన వారికి కూడా కాంగ్రెస్ మోసం చేసింది. రైతులకు అండగా మేముంటాం.. కాంగ్రెస్ మెడలు వంచుతాం.

LEAVE A RESPONSE