రాష్ట్ర క్రీడారంగాన్ని నవీకరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు వేగవంతం అవుతున్నాయి. ఈ క్రమంలో, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన క్రీడా సంఘాలతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) సమావేశం నిర్వహించింది.
సమావేశంలో క్రీడా విధానం, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, చాలాకాలం తర్వాత క్రీడా సంఘాలతో శాప్ సమావేశం ఏర్పాటు చేయడం విశేషం.
ఈ సమావేశానికి శాప్ ఛైర్మన్ రవినాయుడు, ఎండీ గిరీష్, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. క్రీడారంగం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వం అమలు చేయబోయే కొత్త విధానాలు, ప్రణాళికలపై ప్రతినిధులు సూచనలు, సలహాలు అందజేశారు.