Suryaa.co.in

Andhra Pradesh

పల్లె పండుగ ద్వారా పల్లెలకు పూర్వ వైభవం

– గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

బాపులపాడు: పల్లెలకు పూర్వవైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని గన్నవరం నియోజకవర్గం యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.

బుధవారం గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం లోని సిరివాడ గ్రామం లో రూ.20లక్షల వ్యయంతో నిర్మించునున్న 300 మీటర్లు సిసి రోడ్డుకు , ఆరుగొలను గ్రామం రూ.19 లక్షల వ్యయంతో నిర్మించునున్న 2 సిసి రోడ్ల కు , కానుమోలు గ్రామం లో రూ.23లక్షల వ్యయంతో నిర్మించునున్న 415 మీటర్లు సిసి రోడ్డుకు , పెరికిడు గ్రామంలో రూ.14లక్షల వ్యయంతో నిర్మించునున్న 237మీటర్లు సిసి రోడ్డుకు , కొయ్యూరు గ్రామంలో రూ.13లక్షల వ్యయంతో నిర్మించునున్న 200 మీటర్లు సిసి రోడ్డుకు , బొమ్ములూరు గ్రామంలో రూ.8.50లక్షల వ్యయంతో నిర్మించునున్న 139 మీటర్లు సిసి రోడ్డుకు , బాపులపాడు గ్రామంలో రూ. 70 లక్షల వ్యయంతో నిర్మించనున్న 4 సీసీ రోడ్లకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు .

LEAVE A RESPONSE