– జనసేన నేత కిరణ్
విజయవాడ: చొక్కా లేకుండా అరగంట, గంట ఉండటం అంబటి రాంబాబుకు అలవాటేనని జనసేన నేత కిరణ్ వ్యాఖ్యానించారు. ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చొక్కాకు జగన్ స్టిక్కర్ అతికించుకుని తిరుమల దర్శనానికి వెళ్లారు… ఆయన పేరు అంబటి రాంబాబు కాదు… ఆంబోతు రాంబాబు అని జనసేన నేత కిరణ్ అన్నారు. ఈ మేరకు మీడియాతో ఆయన ఏమన్నారంటే..
అంబటి రాంబాబుపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ స్టిక్కర్ తో ఆయన తిరుమలకు రావడం కాదు జగన్ ఇంటి చుట్టూ తిరగాలి. ఒక గంట సేపు చొక్కా విప్పి దర్శనం చేసుకుంటే ఏం అవుతుంది? ఎలాగో ఆయనకు చొక్కా లేకుండా గంట సేపు ఉండటం అలవాటే కదా!