Suryaa.co.in

Political News

6 నెలలు..20 విజయాలు!

( అన్వేష్)

ఐదేళ్ల ధ్వంసరచనతో అధ:పాతాళానికి చేరిన ఆంధ్ర రాష్ట్రాన్ని..తన ఆరు నెలల ఎన్డీయే పాలనలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తున్న వైనం ఆశ్చర్యపరుస్తోంది. అప్పులు-అరాచకాలు-అప నమ్మకంతో నిండిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టండంతోపాటు… ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలలో ప్రధానైన వాటిని, ఆరునెలల కాలంలోనే అమలుచేస్తున్న చంద్రబాబునాయుడు సర్కారుకు జనం హారతి పడుతోంది. గూగుల్ వంటి పెద్ద సంస్థలు రాష్ట్రంలో కాలుపెడుతున్న పరిస్థితి. అమరావతి మళ్లీ పరుగులు తీస్తున్న వైనం. ఇవన్నీ ప్రజలకు ఒక భరోసా. ఒక విశ్వాసం కల్పిస్తున్నాయి. ఈ ఆరునెలల కాలంలో ఎన్డీఏ సర్కారు సాధించిన విజయాలను ఓసారి పరిశీలిస్తే..

చంద్రబాబు ప్రభుత్వం పింఛను ఒకేసారి రూ.1000 పెంచి రూ.4 వేలు 1వ తేదీనే ఇళ్ల వద్ద ఇవ్వడం జరుగుతోంది. ఏడాదికి రూ.33 వేల కోట్లు, ఐదేళ్ళల్లో రూ.1.60 లక్షల కోట్లు పింఛన్లకు ఖర్చు. ఇది దేశంలోనే రికార్డ్. గత జగన్ ప్రభుత్వం మొదటి 4 నెలల్లో పింఛన్లు రూ.250 పెంచడం తప్ప మరే ఇతర నవరత్న హామీలను అమలు చేయలేదు.

198 అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి పేదల ఆకలి తీర్చుతోంది.
దీపం-2 కింద ఇప్పటికే 50 లక్షలకు పైగా ఉచిత గ్యాస్ సిలిండర్ల బుక్ చేసుకున్నారు.
రూ.861 కోట్లతో రోడ్ల మరమ్మత్తుల పనులు ప్రారంభం. సంక్రాంతిలోగా రోడ్ల నిర్మాణం పూర్తి.
ఉచిత ఇసుక సరఫరా వల్ల 125 వృత్తులు, వ్యాపారాలకు చేయూత.
తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా. మద్యం మాఫియా ఆట కట్.
ప్రజారాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరానికి రూ.12 వేల కోట్లు కేంద్రం నిధుల సాధన 8. రూ.4,500 కోట్లతో 13 వేల పంచాయితీల్లో 30 వేల పనులు జరుగుతున్నాయి. సంక్రాంతి నాటికి పూర్తి,
డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ 9 నియామకాలు, 6100 పోలీసు ఉద్యోగ నియామకాలకు చర్యలు.
యాభైకి పైగా జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల రాకతో 4.60 లక్షలకు పైగా పెట్టుబడులు, తద్వారా 5 లక్షల మందికి ప్రత్యక్షంగా
ఉద్యోగావకాశాలు రానున్నాయి. 11. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి భూబకాసురుల నుండి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేందుకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రూపకల్పన,
డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు, విపత్తు సాయం హెక్టారుకు రూ.10 వేల నుండి రూ.25 వేలకు పెంపు… 48 గంటల్లోనే ధాన్యం సేకరణ నిధులు రైతు ఖాతాల్లో జమ,
గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం. ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు. నియంత్రణకు ‘ఈగల్’ టీమ్ ఏర్పాటు.
కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం… కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడల్లో రూ.25 వేల కోట్లు పెట్టుబదులు, 75 వేల మందికి ఉపాధి కల్పనకు కేంద్రం హామీ సాధన,
విశాఖ రైల్వే జోన్ కు 52 ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయింపు. విశాఖ ఉక్కు పరిరక్షణ. విశాఖలో టీసీఎస్ డేటా సెంటర్ ద్వారా 10 వేల ఉద్యోగాలు,
రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాకు కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజీ సాధన, బీసీ సంక్షేమానికి రూ.39 వేల కోట్లు బడ్జెట్లో కేటాయింపు.
ఎస్సీ సంక్షేమానికి రూ.18 వేల కోట్లు బడ్జెట్లో కేటాయింపు,
ఎస్టీ సంక్షేమానికి రూ.7.5 వేల కోట్లు బడ్జెట్లో కేటాయింపు.
మైనారిటీ సంక్షేమానికి రూ.4 వేల కోట్లు బడ్జెట్లో కేటాయింపు.
ఖజానా దివాలా తీసివున్నా ఆరు నెలల్లోనే 400కు పైగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించి చంద్రన్న ప్రభుత్వం రికార్డు సృష్టించింది.
ప్రతిపక్ష నేతగా జగన్ వైఫల్యం చెందారు. ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతమైంది. జగన్ కుంభకోణాలు నుండి ప్రజాదృష్టి మళ్ళించడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు..

LEAVE A RESPONSE