Suryaa.co.in

Telangana

చట్టం ముందు అందరూ సమానులే

– ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు
– మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులు
– అల్లు అర్జున్ అరెస్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఢిల్లీ: అల్లు అర్జున్ అరెస్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
‘‘ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుంద’’ని స్పష్టం చేశారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు . నటుడు మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE