– లగచర్ల రైతులు చేసిన తప్పేమిటి ?
– టూరిజం మీద కాదు లగచర్ల లో జరిగిన టెర్రర్ మీద చర్చ జరగాలి
– సీఎం ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం తప్ప రాష్ట్రం లో ఏమీ లేదు.
– తెలంగాణ అసెంబ్లీ పాయింట్ లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ కె .సంజయ్
హైదరాబాద్: బీఏసీలో చర్చించకుండానే అసెంబ్లీ ఎజెండా ఖరారు చేయడం దారుణం. టూరిజం మీద కాదు ఇపుడు చర్చించాల్సింది. లగచర్ల లో రైతులను అక్రమం గా అరెస్టు చేయడం పై చర్చించాలి. లగచర్ల రైతులు చేసిన తప్పేమిటి ? నెల రోజులుగా జైల్లో వేసేంత తప్పు రైతులు ఏం చేశారు? గుండె పోటు వచ్చిన హీరా నాయక్ కు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకు వస్తారా? యావత్ తెలంగాణ రైతులను అనుమానించారు. టూరిజం మీద చర్చ కాదు లగచర్ల లో జరిగిన టెర్రర్ మీద చర్చ జరగాలి.
అదానీ అల్లుడు అన్నదమ్ముల కోసం రేవంత్ భూ సేకరణ చేస్తున్నారు. లగచర్ల పై చర్చ జరగాలని వాయిదా తీర్మానం ఇచ్చాము. ఎట్టి పరిస్థితుల్లో చర్చ జరగాల్సిందే. సీఎం ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం తప్ప రాష్ట్రం లో ఏమీ లేదు. వెంటనే ఎన్నికలు రావాలనీ ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నికలు వస్తే రేవంత్ పీడ వదలిపోతుందని రైతులు అనుకుంటున్నారు.
75 లక్షల మంది రైతులు రేవంత్ పై ఆగ్రహం తో ఉన్నారు. అప్పులపై కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. rbi హ్యాండ్ బుక్ లో పేర్కొన్న దాని ప్రకారం మన అప్పు 3 లక్షల 17 వేల కోట్లే. అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయలంటూ అసెంబ్లీ ని తప్పుదోవ పట్టించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిస్తాం.