-వైఎస్సార్సీపీ ఎస్‌సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు డిమాండ్
ఒంగోలు: ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఉలిచి గ్రామంలో దేవరంపాడు గ్రామసర్పంచ్ కనుమూరి మహాలక్ష్మికి చెందిన పూరిపాకలు తగులబెట్టిన ప్రాంతాన్ని ఉలిచిగ్రామంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చుండూరు రవి తో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు సందర్శించారు.
ఈ సందర్భంగా కనకారావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులపై దాడులు, దళిత మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, ఎన్డీయే కూటమికి దళితులు ఓట్లు వేయలేదనే కక్షతో వేదింపులకు గురిచేస్తున్న క్రమంలోనే దళిత సర్పంచ్ మహాలక్ష్మి కి చెందిన పూరిపాకలు తగులబెట్టటం,పాకల్లో ఉన్న పొగాకు నారు మూటలు, ఎరువులు తదితర సామాగ్రి కాలిపోయి సుమారు మూడు లక్షల వరకు నష్టపోయారని తెలిపారు.
దళితుల సంక్షేమం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్మరించిం దనే అపోహలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందిన టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ రాజ్యాంగ అమలుచేస్తూ దళితులకు రక్షణ లేకుండా చేస్తున్నారని, ఈ ఆరునెలల్లో ఐదుగురు దళితులు చనిపోవడమే కాకుండా షుమారు ఐదు వందలకు పైగా దళిత మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని,ఇది టీడీపీ దళితులు ఓట్లు వేసినందుకు గిఫ్ట్‌లు గా ఇచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకృష్ణ, కనుమూరి నాగరాజు,రమణయ్య తదితరులు పాల్గొన్నారు.