– అదానీతో 12,400 కోట్ల ఒప్పందాలు రద్దు చేసుకోవాలి
– రామన్నపేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి రేవంత్ అనుమతులు
– కాంగ్రెస్ నేతలపై సీపీ సీవీ ఆనంద్ కేసులు పెట్టాలి.
– అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి .హరీష్ రావు
హైదరాబాద్: రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుంది.ఢిల్లీలో దోస్తీ,గల్లీలో కుస్తీ చేస్తున్నారు. రాజ్ భవన్ ముట్టడిలో కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మేము రేవంత్ రెడ్డి,ఆదానీ ఫోటోతో అసెంబ్లీకి వస్తే మమమ్మల్ని అడ్డుకున్నారు. అదానీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 12 వేల కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి.
అదానీపై రేవంత్ రెడ్డి పోరాటం నిజమైతే, ఒప్పందాలు ఎందుకు రద్దు చేసుకోవడం లేదు అదానీకి వంద కోట్లు వాపస్ ఇచ్చినట్లు 12,400 కోట్ల ఒప్పందాలు రద్దు చేసుకోవాలి. రామన్నపేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి రేవంత్ అనుమతులు ఇస్తున్నారు. అదానీకి రేవంత్ రెడ్డి కొమ్ముకాస్తున్నారు. రోడ్డుపై రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అదానీకి ఏజెంట్ లా పని చేస్తున్నారు.
అదానీకి రెడ్ కార్పెట్ వేసి తెలంగాణ పరవును,రాహుల్ గాంధీ పరువును రేవంత్ రెడ్డి మంట కలిపారు. రేపు అసెంబ్లీలో అదానీ,రేవంత్ రెడ్డి సంబందంపై చర్చ పెట్టాలి. రాజ్ భవన్ ముట్టడిలో అదానీ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి పార్టీ తిడితే 100 కోట్లు అదానీకి వాపస్ ఇచ్చారు. చట్టం అందరికీ సమానం అయితే కాంగ్రెస్ నేతలపై సీపీ సీవీ ఆనంద్ కేసులు పెట్టాలి.