– ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది
– రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది..లాభాల బాట పడుతుంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ సమస్య అయినా పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆర్టీసీ కార్మికుల పోరాటంతో తెలంగాణ సాధించబడింది.
తెలంగాణ సాధించిన తరువాత 10 సంవత్సరాలు ఏం జరిగిందో చూసాం ఆర్టీసీని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు కారుణ్య నియామకాలు చేపట్టాం ,ఆర్టీసీ తార్నాక ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ గా మార్చి అందరిని అందుబాటులోకి తెచ్చాం. వారి పెండింగ్ బకాయిలు TA,DA లు ఇచ్చాం. కొత్త నియామకాలు చేపడుతున్నాం. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం.
మూడు ప్రధాన అంశాలు ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం ఆర్టీసీ సంస్థ పరిరక్షణ గా ముందుకు పోతున్నాం. సమ్మెకు పోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. వారి రెండు ప్రధాన అంశాలు ముఖ్యమంత్రి నోటీసులో ఉన్నాయి. వాటిని కూర్చొని మాట్లాడుకుంటాం. ట్రేడ్ యూనియన్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇది సమ్మెకు పోయే కాలం కాదు. 1562 కోట్ల పిఎఫ్ కాయలను 600 కోట్లకు తగ్గించాం. సిసిఎస్ బకాలను పూర్తిగా తగ్గించేసాం. రిటైర్మెంట్ అయిన రోజే వారి బెనిఫిట్స్ ఇవ్వాలని కార్యాచరణ చేస్తున్నాం. బ్యాంకుల్లో బకాయిలు ఉన్నాయి. సంస్థ నిలబడాలి. ఆర్టీసీ 40,000 కుటుంబాలు బాగుపడాలని కోరుకునే ప్రభుత్వం.
తెలంగాణ ఉద్యమకారుడుని. ఆనాడు నైచేలేగా బస్ కి పయ్యా అని నినాదంతో ఉద్యమం చేశారు. సంస్థను ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు సానుకూల దృక్పథంతో ముందుకు పోతున్నాం. ఆర్టీసీ సమ్మె పునరాలోచన చేయాలి. ముందుగా ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు. నేరుగా సమ్మె అన్నారు. సహృద్భావ సంబంధాలతో ఆర్టీసీని రక్షించుకోవాలి. మీరంతా నా కుటుంబ సభ్యులు. ఆర్టీసీ సమ్మె వద్దు మీకు విజ్ఞప్తి చేస్తున్న.