గత కొంతకాలంగా అందరూ ఎక్కువ ఉపయోగిస్తున్న మెడిసన్లో ముఖ్యమైనది డోలో 650. చిన్న జలుబు చేసిన, జ్వరం వచ్చిన ముందుగా డోల్ను వేసుకుంటుంటారు. అయితే దీనిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనేక సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. గుండె వేగం నెమ్మదించడం లేదా కొన్ని సార్లు అమాంతంగా పెరగడం, గొంతు భాగంలో వాపు, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరి ఆడకపోవడం, అలాగే నాడీ వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.