విజయవాడ: భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ బీజేపీ నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు .
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఊర్మిళ నగర్ మండల అధ్యక్షులు పగడాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి బెన్నా భక్తుల సోమేశ్వరరావు మాట్లాడుతూ సమైక్య భారతావని కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. బీజేపీ శ్రేణులందరూ డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధన కోసం అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కందుల సుబ్రహ్మణ్యేశ్వరరావు , దుర్భేసుల హుస్సేన్, జయబాలన్ , దొడ్ల రాజా, చెల్లా రమాదేవి, గోవిందమ్మ బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు