Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ రైతు భరోసా కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే

– స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నందువల్ల మరోసారి రైతులని రేవంత్ రెడ్డి మోసం చేస్తూన్నాడు
– ఎగ్గొట్టిన రైతు భరోసా,వెయ్యని 2 లక్షల రుణమాఫీ,ఇవ్వని వడ్ల బోనస్ కలిపి 5 ఎకరాల రైతుకు ఇప్పటికే రేవంత్ రెడ్డి 4,35,500 బాకీ ఉన్నాడు
– రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది
– నిజామాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం

నిజామాబాద్: రేవంత్ కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేస్తుంది అని, ఓట్ల సమయంలోనే రైతులకు పథకాలు వర్తింపజేస్తుంది అని, ఓట్లు లేకుంటే రైతులకు ఇచ్చే పథకాలను ఎగ్గొడుతు, వాటి ఊసు ఎత్తడం లేదు అని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాలనపై విమర్శలు గుప్పించారు.

ప్రపంచంలోనే రైతులకు డైరెక్ట్ గా నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టిన రైతు బాంధవుడు కేసీఆర్. మొదటిసారి నేరుగా రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రైతులు నాట్లు వేసేటప్పుడే కేసీఆర్ రైతు బంధు ఇచ్చాడు కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లప్పుడు మాత్రమే రైతుబంధు ఇస్తున్నాడు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు పంట సీజన్ లు వచ్చాయి. మొదటిసారి.. ఎంపీ ఎన్నికలు ఉండటం వల్ల రైతు బంధు ఇచ్చాడు. అవి కూడా కెసిఆర్ రైతు బంధు కోసం ఉంచిన డబ్బులే ఇచ్చాడు. రెండోసారి…ఏ ఎన్నికలు లేనందు వల్ల రైతు భరోసా ఎగ్గొట్టాడు.
మూడోసారి…ఏ ఎన్నికలు లేనందున తూతూ మంత్రంగా 3 ఎకరాల వరకు ఇచ్చి మిగితా వారికి ఎగ్గొట్టాడు. నాలుగవ సారి… స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న దృష్ట్యా ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నాడు.

ఎన్నికలు ఉంటే రైతు బంధు. ఎన్నికలు లేకుంటే రైతుబంధు లేదు. ఇది కాంగ్రెస్ నైజం. రైతులు గమనించాలి. కేవలం ఎన్నికల కోసం రైతు భరోసా వేసి రైతు లను మోసం చేసి ఓట్లు తీసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు.

LEAVE A RESPONSE