ఢిల్లీ: ఏఐ సాంకేతికతతో దేశంలోనే తొలి డిజిటల్ హైవే ఢిల్లీ-గురుగ్రాం మధ్య అందుబాటులోకి వచ్చింది. 28 కిలోమీటర్ల మేర అత్యాధునిక నిఘా వ్యవస్థను ఈ రహదారిపై అమర్చారు. హైస్పీడుతో వాహనాలు నడపడం ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగితే ఆటోమెటిక్ గా ఇది రికార్డు చేస్తుంది. ఏవైనా ప్రమాదాలు చోటు చేసుకున్నా సంబంధిత సిబ్బందికి వెంటనే సమాచారం చేరవేస్తోంది. ఇది విజయవంతమైతే దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.