Suryaa.co.in

Telangana

బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా

హైదరాబాద్: ప్రజాస్వామ్యం లేని పార్టీలో తాను ఉండలేనని భారతీయ జనతా పార్టీకి గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ లోధ్ రాజీనామా చేశారు. గతంలో ఎన్నికల సీట్ల కేటాయింపులోనూ ఆయన మాటలు నచ్చక పార్టీ సస్పెండ్ చేసింది, తిరిగి చేర్చుకుంది. ఆయన అదే పార్టీలో ఉన్నారో లేరో కానీ, మొత్తానికి ఇవాళ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు, తెలంగాణ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి కార్యకర్తలతో వచ్చారు. పార్టీ నేతలు అడ్డుకున్నార. ఇదేం ప్రజాస్వామ్యం అంటూ ఆయన రాజీనామా లేఖ రాసి ప్రస్తుత అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపించారు. కార్యకర్తలు కదా అధ్యక్షులను ఎన్నుకునేది? అధిష్టానం ఎంపిక చేయడం ఏమిటి? అంటూ ఆయన నిరసన తెలిపారు.

LEAVE A RESPONSE