– భూస్థాపితం కాబోయే వైసీపీని పైకి తీసురావాలనే ఈ అల్లర్లు
– భార్యని కూడా దొంగని చేసిన మహిళల ఆత్మగౌరవం దెబ్బతీశారు
– పెర్ని నానిపై శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ నిప్పులు
మంగళగిరి: బీసీ మహిళను నీచ రాజకీయంలోకి లాగి, కులాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతీయాలనే పేర్ని నాని ప్రయత్నం విఫలమైందని శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. ఈ మేరకు ఆమె మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 164 సీట్లతో కూటమి ప్రభత్వం బంపర్ మెజార్టీ తో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. విజన్ 2047 లో భాగంగా అమరావతి సంపద సృష్టించే రాజధానిగా పరుగులు తీస్తోంది. పోలవరం రాష్ట్రం మొత్తాన్ని ఉద్ధరించడమే కాకుండా ఉత్తరాంధ్రకి ఇండస్ట్రియల్ గా డెవలప్ అయ్యే విధంగా ఉరకలేస్తోంది. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా నారా లోకేష్ ఇండస్ట్రియల్ దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే…
రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలౌతున్నాయి. రాష్ట్రంలోని పేద ప్రజలకు, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గంజాయిని రూపు మాపారు. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా అమలౌతోంది. ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. ఇలాంటి పరిస్థితిలో వైసీపీ ఎక్కడ భూస్థాపితం అయిపోతుందో అని భయపడి భూస్థాపితం కాబోయే వైసీపీ పార్టీని మళ్ళీ పైకి తీసురావాలనే ఉద్దేశంతో పేర్ని నాని గంజాయి నీళ్లు పోసి వైసీపీ పార్టీని మళ్ళీ ఏదో ఒక రకంగా బతికించాలని పన్నాగం పన్నాడు.
ఆ పన్నాగంలో భాగంగా కృష్ణా జిల్లాని ఎంచుకున్నాడు. పామర్రు, పెడన, గుడివాడ అన్ని చోట్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. చీకటి అంటాడు, చీకట్లో అన్ని చేసేయాలి అంటాడు, తెల్లారి ఎవరికీ తెలియకుండా వెళ్లి పరామర్శించాలంటాడు.. ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. అవినీతిలో దిట్టైన ఈ పేర్నినాని వందల ఎకరాలు కబ్జా చేశాడు. పేర్ని నాని హైవేలు సైతం వదిలి పెట్టకుండా ఎకరాలు ఎకరాలు మింగేశాడు. విజయనగరంలో కూడా వేల ఎకరాలు కబ్జా చేశాడు. చేపల చెరువులు, పార్కులను కూడా వదిలిపెట్టకుండా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ పేర్ని నాని చివరికి రేషన్ బియ్యంలో కుంభకోణం చేశాడు.
అవినీతిలో ఇతనితో పాటు ఇతని భార్యని కూడా దొంగని చేసిన ఈ పేర్ని నాని మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాడు. బీసీ మహిళని రాజకీయంలోకి లాక్కొచ్చి రచ్చరచ్చ చేశాడు. ఈ రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ లేకుండా చేసి లబ్ధి పొందాలని చూశాడు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి, సంక్షేమాన్ని మరుగుపరచటానికి ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నాడు. ఊళ్ళు పట్టుకొని తిరగటమే కాకుండా విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టి భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగమైన ఒక వీడియోన కూడా బయటపడింది. బీసీల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు.
గౌడ కులానికి సంబంధించిన మహిళని లోకేష్ అల్లరి చేయమన్నారని చెప్పి స్టేట్ మొత్తం మనం ప్రచారం చేయాలి అని చెప్పి సలహాలు ఇస్తూ పేర్ని నాని అడ్డంగా బుక్ అయ్యాడు. ఆనాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అమర్నాథ్ గౌడ్ ని ఏ రకంగా పెట్రోల్ పోసి తగలపెట్టారన్న విషయం బీసీలకు, ముఖ్యంగా గౌడ కులస్తులకు తెలుసు. ఆరోజు అమర్నాథ్ గౌడ్ ని నా అక్కని ఏడిపించొద్దు, ర్యాగింగ్ చేయొద్దు అని చెబితే… సొంత తమ్ముడైన అమర్నాథ్ గౌడ్ మాట్లాడాడని తెల్లవారు జామున ట్యూషన్ కి వెళ్తుంటే నోట్లో గుడ్డలు కుక్కి ఆ పిల్లోడి మీద పెట్రోల్ పోసి చంపితే ఆ కుటుంబానికి ఈరోజు ఉద్యోగం ఇచ్చిన ఆదుకుంది కూటమి ప్రభుత్వం.
గౌడ కులస్తురాలైన గౌతు లచ్చన్న మనమరాలు గౌతు శిరీషాని అక్రమ కేసులు బనాయించి తప్పుడు కేసులు కట్టడమే కాకుండా అక్రమ సంబంధాలు కూడా అంటగట్టి నైతికంగా గౌతు శిరీషని ఏ రకంగా అవమానించారో రాష్ట్ర ప్రజలకి, గౌడ కులస్తులకి అందరికీ తెలుసు. ఇతర బీసీ కులస్తుల్ని 300 మందికి పైగా హత్యలు చేశారు. బీసీలెవరైనా ఎదురిస్తే నాలుక తెగ్గోస్తామని బహిరంగంగా మాట్లాడారు. లోకల్ బాడీస్ లో బీసీలు లీడర్లు అవ్వకూడదు అని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 34% రిజర్వేషన్ ని తగ్గించేశారు. 16,800 మందిని బీసీ లీడర్లుగా ఎదగకుండా చేసిన మీకు నేడు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడఉంది?
ఏ రాజారెడ్డి రాజ్యాంగంలో ఉందో చెప్పాలి. బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్ బీసీలకే దక్కింది. నేడు బీసీ మహిళల గురించి మాట్లాడి ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేద్దామనుకుంటే ఎవ్వరు ఊరుకోరు. పేర్ని నాని ఏ విధంగా మహిళల ఆత్మాభిమానం గురించి మాట్లాడతారు. పేర్ని నాని తన ఇంట్లోనివారి ఆత్మాభిమానాన్ని కాపాడలేకపోతే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కాపాడారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు. నేడు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు.
మంత్రి కొడాలి నాని గుడివాడని క్యాసినో, పేకాట గుడివాడిగా మార్చేశాడు. ఎవరైనా క్యాసినో ఆడాలని అన్వేషిస్తే గుడివాడ వెళ్లండని సూచించే స్థాయికి తీసుకొచ్చారు. గుడివాడకు చెడ్డుపేరు తెచ్చారు. అందుకే చిత్తు చిత్తుగా ఓడిపోయి తను చేసిన అరాచకాలకు ఎక్కడ అరెస్ట్ అవుతాడో అని భయపడి నాకు ఆ నొప్పు ఉంది, ఈ నొప్పు ఉంది, గుండె నొప్పు ఉంది అని చెప్పి ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నాడు. అతను లేని లోటును భర్తీ చేసేందుకు 30 రోజుల్లో తిరిగి వస్తాడు అని చెప్పి పేర్ని నాని బయలుదేరాడు. నేడు వెనిగండ్ల రాము ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోంది.
గుడివాడ మెయిన్ రోడ్ల దగ్గర నుంచి పార్కుల వరకు, కలుషిత నీరు రాకుండా మంచి మంచినీటి సదుపాయం కల్పించే దగ్గర నుంచి చివరికి బస్ స్టాండ్ సైతం అభివృద్ధి చెందింది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరుగుతోంది. దగ్గర నుంచి అవసరమైన చోట సొంత నిధులతో ఈరోజు వెనిగండ్ల రాము ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి చేస్తున్నారు. ఇవన్నీ ప్రజల దృష్టికి వెళ్లకూడదని గుడివాడని ఇంకో కడప చేయడానికి ప్రయత్నం చేశారు. కడపకు కూడా నీళ్ళ ఇచ్చింది చంద్రబాబు నాయుడే.. కడపలోని పులివెందులనందలి చీని చెట్లకు కూడా నీరందించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయొద్దని హెచ్చరిస్తున్నాం. పేదల నోటికాడి బియ్యాన్ని సైతం దోచుకున్న నీచుడు పేర్ని నాని.