టిడిపి అధినేత చంద్రబాబు ఒక మంచిపని చేశారు! టిడిపి వీర విధేయ మహారాజు పూసపాటి అశోక్ గజపతి రాజుకు గవర్నర్ హోదా కల్పించేలా ప్రతిపాదన చేయడం, వెంటనే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఓకే చేయడం జరిగిపోయింది! నూతన గవర్నర్ల జాబితాలో అశోక్ గజపతిరాజును గవర్నర్ గా నియమించి గోవాకు కేటాయించారు!
ఇప్పటికే తెలుగు నేతలు గవర్నర్లుగా ముగ్గురు వున్నారు! ఇప్పుడు నాలుగో గవర్నర్ అశోక్ గజపతి రాజు! గతంలోనూ మరో ముగ్గురు గవర్నర్లు గా సేవలు అందించారు.
టిడిపి హయాంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత అశోక్ గజపతిరాజు! ఒకసారి ఎంపి గా గెలిచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పని చేశారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిడిపి అధికారంలో ఉన్న ప్రతిసారి మంత్రివర్గంలో ఆయన పేరు ఖాయంగా ఉండేది!
పూసపాటి రాజ వంశానికి చెందిన అశోక్ గజపతి రాజు విజయనగరం ఎస్టేట్ కు అధిపతి! సూర్య వంశపు ఉదయపూర్ మహారాజా వారసులు! వీరి తండ్రి విజయనగరం రాజా సాహెబ్ విజయరామ గజపతి రాజు పార్లమెంట్ సభ్యులుగా పని చేశారు. అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మి ప్రస్తుతం విజయనగరం టిడిపి ఎమ్మెల్యే గా ఉన్నారు!
ఎన్నో భూములను పేదలకు దానం చేసిన వంశం! ఎంతో సింప్లిసిటీ జీవితం! తన కారు కూడా తనే తుడుచుకుని తనే డ్రైవింగ్ చేసుకునే అరుదైన విలక్షణ వ్యక్తిత్వం! గవర్నర్ హోదా లభించడం స్ఫూర్తిదాయకం!