– గత ప్రభుత్వం ఐదేళ్లు కాలములో గుంతలు కూడా పూడ్చలేని జగన్
– పర్యటనల పేరుతో రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారు
– జగన్ అవగాహన, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు
– మంత్రి నాదెండ్ల మనోహర్
విజయవాడ: మాజీ సీఎం వైఎస్ జగన్ అవగాహన, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, “రైతుల కోసం మీరు చేసింది ఏంటో చర్చకు సిద్ధమా?” అని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
కానూరు సివిల్ సప్లై భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, మాజీ సీఎం జగన్ అబద్ధాల ప్రచారం చేస్తున్నారన్నారు. ఆయన మాట్లాడిన మాటలకు ఇది ఇది వివరణ గాని ఎదురు దాడి కాదన్నారు. ప్రజల తీర్పును అర్థం చేసుకోవాలని హితవు పలికారు..
ప్రజలు అధికారం ఇచ్చేది ఐదేళ్లకు అని జగన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఐదేళ్లు కాలంలో గుంతలు కూడా పూడ్చలేని జగన్ ఈరోజు కూటమి పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మద్యపాన నిషేధం, అమ్మబడి అని మీరిచ్చిన హామీ ఎప్పుడు ప్రారంభించారు? ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ప్రో డెవలప్మెంట్, ప్రో వెల్ఫేర్ చేయాలని ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అభివృద్ధి చేస్తారని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు.. మీకంటే ఎక్కువ బటన్ లు నొక్కుతారని కాదు అన్నారు.
దీపం 2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ లను నాలుగు నెలలకోసారి అందిస్తున్నామన్నారు. ఉచిత గ్యాస్ జగన్ కు, అతని కార్యకర్తలకు రాలేదని
అందరికీ రాలేదని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. 31 అక్టోబర్ 2024 సంవత్సరంలో దీపావళి రోజున శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీపం- 2 పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ను అందిస్తున్నామన్నారు.
మొదటి విడతలో 97 లక్షల మందికి ఉచిత గ్యాస్ అందించాం అన్నారు. ఇందుకు గాను కూటమి ప్రభుత్వం 846 కోట్లు విడుదల చేసిందన్నారు. రెండవ విడత 91.10 లక్షల మందికి ఉచిత గ్యాస్ అందించాం. ఇందుకు గాను కూటమి ప్రభుత్వం. 712 కోట్లు ఖర్చు ఖర్చు చేసినట్లు తెలిపారు.
ప్రజల పక్షాన రైతులు పక్షాన మాట్లాడుతున్నాం అన్న మీరు 1674 కోట్లు రూపాయల ధాన్యం బకాయిలు ఎగ్గొట్టి ఎందుకు వెళ్లిపోయారు అని ప్రశ్నించారు. జగన్ పాలనలో ధాన్యం రైతులకు నరకం చూపించారు.. గోదావరి జిల్లాలో క్రాఫ్ హాలిడే ప్రకటించిన విషయాన్నీ గుర్తు చేశారు.
రైతుల కోసం మీరు చేసింది ఏంటో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఖరీఫ్ మరియు రబీ సీజన్లో కూటమి ప్రభుత్వం 12857 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు.. ఇందులో 12000 కోట్ల రూపాయలను 24 గంటల్లో రైతు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.. వెయ్యి కోట్ల రూపాయలు జమ చేయడంలో జాప్యం జరిగిందని..40 రోజులు ఆలస్యంగా రైతు ఖాతాలో జమ చేసిన విషయం వివరించారు.
దీనిపై జగన్ అవగాహన పెంచుకోవాలన్నారు. గూగుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ A1 సమాచారం తీసుకొని అవగాహన పెంచుకోవాలన్నారు.