– ఆయన అసమర్థ ముఖ్యమంత్రి
– వైసీపీ గాలికి పుట్టిన పార్టీ
– లిక్కర్ తయారుచేసింది జగన్, అమ్మింది జగన్, లెక్కలు చూపకుండా 32 వేల కోట్లు దోచుకుంది జగన్
– కక్ష కట్టి చంద్రబాబు, నన్ను మానసికంగా హింసించి జైలుకు పంపారు
– అద్దంకి పర్యటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అద్దంకి: పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడని, ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలలో పనిచేసిన ముఖ్యమంత్రుల్లో నెంబర్ వన్ అసమర్ధ సీఎం జగన్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఏఎంసీ లో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. కమిటీ చైర్మన్ గా ఎన్నికైన తేలప్రోలు రమేష్, కమిటీ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో హెచ్ డీ నల్లబెర్లీ పొగాకు రైతులు నష్టపోకూడదని దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేపట్టిందన్నారు. అందుకు అనుగుణంగానే ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో 42 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో అధికారంలో ఉంటే ప్రజలకు సేవ చేశామని, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాల పోరాటం చేసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించామని తెలిపారు. కానీ, 2019 సంవత్సరం నుండి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పడిన కష్టాలు మాటల్లో చెప్పలేవనివని అన్నారు. ఇందుకు కారణం ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసన సభ్యుడు చదలవాడ అరవింద్ బాబు, జీవీ ఆంజనేయులు, అద్దంకి, సంతమాగులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్, పాలక వర్గం సభ్యులు, తేదేపా శ్రేణులు పాల్గొన్నారు.