రామచంద్రపురం: ఆర్థిక సమస్యలతో, అనారోగ్యంతో బాధపడుతున్న ఇరువురికి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ఆర్థిక సహాయం అందించారు. రామచంద్రపురం నియోజవర్గం కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన నామన రామదుర్గ మణికంఠ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి వైద్య ఖర్చులు నిమిత్తం మంత్రి సుభాష్ ఆర్థిక సహాయం అందించారు. అదే గ్రామానికి చెందిన గుండారం నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదానికి గురై ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. వీరి కుటుంబానికి కూడా మంత్రి చెక్కు ఇచ్చి ఆపన్న హస్తం అందించారు.