(చాకిరేవు)
మనీ హైస్ట్ జస్ట్ ఒక ఊహాజనిత వెబ్ సిరీస్. మన జగన్ & కో లిక్కర్ స్కాం గ్యాంగ్ జియో మ్యాపింగ్ ఎస్కేప్ ప్లానింగ్ స్ట్రాటజీ రియల్.
డెన్లకోసం కేవలం ఫ్లాట్లను ఎంపిక చేయలేదు, కరెన్సీని హాయిగా దాచేసే ఒక అర్బన్ హైడ్ గ్రిడ్‌నే ఆర్కిటెక్ట్ చేశారు.
ఏపీ లిక్కర్ స్కామ్… రూ.3,500 కోట్ల కుంభకోణం, దేశంలోనే అతిపెద్దదని కోర్టులు సైతం నివ్వెరపోతున్నాయి! ఈ వ్యవహారంలో కేవలం డబ్బుల లెక్కలే కాదు, ఆ డబ్బులు ఎక్కడ పంచుకున్నారు, కుట్రలు ఎక్కడ పన్నారు అనే వివరాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. సిట్ దర్యాప్తులో ఏడు ‘రహస్య ప్రాంతాల్లోని డెన్లు’ బయటపడ్డాయి. ఆ డెన్ల ఎంపిక వెనుక ఉన్న ‘మెదడు’ గురించి వింటే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు!
డెన్ల వెనుక ‘స్ట్రాటజిక్’ లాజిక్… ఇది మామూలు స్కెచ్ కాదు!
వాళ్ళు ఎంచుకున్న డెన్లు చూస్తే, “అయ్యబాబోయ్, వీళ్ళు మామూలోళ్ళు కాదు!” అనిపిస్తుంది. వాటి వెనుక ఉన్న ‘స్ట్రాటజిక్’ ఆలోచన ఎలా ఉందో చూద్దాం:
అన్ని డెన్లు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, నానక్‌రామ్‌గూడ వంటి సంపన్న లేదా జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే, జనంలో జనంగా కలిసిపోవడానికి ప్లాన్ అన్నమాట! బిజీగా ఉండే ప్రాంతాల్లోనే ప్రైవసీ దొరుకుతుందట! అంటే, పక్క ఇంట్లో పార్టీ జరుగుతున్నా, వీళ్ళ ఇంట్లో కోట్లకు కోట్లు లెక్కపెట్టుకున్నా ఎవరికీ అనుమానం రాదన్నమాట. అబ్బో, వీళ్ళ తెలివితేటలు!
చాలా డెన్లు గేటెడ్ కమ్యూనిటీలు లేదా ఖరీదైన అపార్ట్మెంట్లలో ఉన్నాయి. అంటే, లోపలికి ఎవరెళ్తున్నారో, ఎవరు వస్తున్నారో పక్కా కంట్రోల్ ఉంటుందన్నమాట. సీసీటీవీలు కూడా ఉన్నాయి… అదో విచిత్రం, తమ పనులను తామే పర్యవేక్షించుకోవడానికి కెమెరాలు పెట్టుకున్నారన్నమాట!
ఈ డెన్లు హైదరాబాద్‌లోని పశ్చిమ కారిడార్‌లో… అంటే రాజకీయ, వ్యాపార, మీడియా ప్రముఖులు నివాసం ఉండే ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి. గుంటూరులో ఒక డెన్, డబ్బును రాజకీయ పనులకు కేంద్రంగా వాడడానికి.
హైదరాబాద్‌లో స్కెచ్ గీసి, గుండూరులో ‘గూడు’ పెట్టుకున్నారన్నమాట, జగన్ ప్యాలెస్ పక్కన!
కొన్ని ఫ్లాట్లు రాజకీయ సహాయకులు, షెల్ కంపెనీల డైరెక్టర్లు లేదా నమ్మకస్తుల పేర్లతో ఉన్నాయట! అంటే, లీకుల రిస్క్ లేకుండా, తమ కంట్రోల్లో ఉన్న ప్రదేశాలనే ఎంచుకున్నారు.
ప్రతి డెన్‌కు ఒక ప్రత్యేకమైన పాత్ర ఉందట!
డెన్ 1–3: ఇవి హై-లెవల్ మీటింగ్‌లు, ప్లానింగ్‌లకు ఉపయోగపడ్డాయట. అంటే, ‘ముహూర్తం’ ఫిక్స్ చేసే స్థలాలు అన్నమాట!
డెన్ 4–6: క్యాష్ హ్యాండ్లింగ్, కోఆర్డినేషన్ (డబ్బు తరలించే వ్యక్తుల మధ్య సమన్వయం), లేదా డిజిటల్ స్పూఫింగ్ (VoIP కాల్స్, VPN సెటప్‌లు) కోసం వాడారట. అంటే, ఇవి ‘ఆపరేషన్ థియేటర్లు’ అన్నమాట!
డెన్ 7 (గుంటూరు): హైదరాబాద్ నుంచి సుమారు 270 కి.మీ. ప్రాంతీయ పంపిణీ, ఎన్నికలకు సంబంధించిన లాజిస్టిక్స్ కోసం.
జియో-స్ట్రాటజీలో వీళ్లు మామూలు జీనియస్‌లు కాదు!
హైదరాబాద్ ‘క్లస్టర్’ (డెన్స్ 1–6): ఈ ఆరు డెన్లు హైదరాబాద్‌లోని వెస్ట్ కారిడార్‌లో, కేవలం 10-12 కి.మీ. పరిధిలోనే ఉన్నాయి! అంటే, ఒక ‘రహస్య నెట్వర్క్’ లాగా అన్నమాట. అవుటర్ రింగ్ రోడ్‌కు దగ్గరగా ఉండటం వల్ల, ఒక డెన్ నుంచి ఇంకో డెన్‌కు ‘బుల్లెట్ స్పీడ్’లో వెళ్లిపోవచ్చు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా 30-40 నిమిషాల దూరంలోనే.. అంటే, ‘ఆపరేషన్’ అయిపోగానే, కావాలంటే ఫ్లైట్ ఎక్కేసి ‘మాయం’ అవ్వొచ్చు! ఈ ‘క్లోజ్ ప్లానింగ్’ సక్సెస్ రేటు 85% అనుకొన్నారు.
ఇవన్నీ వింటుంటే, ఈ కుంభకోణం వెనుక ఎంత ‘తెలివైన’ (?) బృందం ఉందో అర్థమవుతోంది! ఈ డెన్ల అడ్రస్‌లతో సహా బయటపడటం చూస్తుంటే, వారి ‘మాస్టర్ ప్లాన్’ ఎంత ‘పర్ఫెక్ట్’గా ఉందో స్పష్టమవుతోంది!
