– నేను పెద్దిరెడ్డిని ఎయిర్పోర్టులో మర్యాదపూర్వకంగా కలిశా
– నాపై దుష్ట్రచారం చేసేవారికి ఒకరోజు బియ్యం వస్తుందేమో?
– పెద్దిరెడ్డితో భేటీపై గళం విప్పిన తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు
తిరువూరు: తాను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసినట్లు వస్తున్న వీడియోలు, కథనాలపై తిరువూరు ఎమ్మెల్యే డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు విరుచుపడ్డారు. ‘‘స్పీకర్ అయ్యన్నపాత్రుడు-వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఇటీవలి కలుసుకున్నప్పుడు వారిద్దరూ నవ్వుకుంటూ వాటేసుకున్న వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి. మరి దాని గురించి మాట్లాడరేం? కేవలం నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేను ఎయిర్పోర్టులో పెద్దిరెడ్డి ఎదురుపడినప్పుడు, సాటి శాసన సభ్యుడిగా మర్యాదపూర్వకంగా పలకరించా. అది కూడా కేవలం 8 సెకన్లు మాత్రమే నన్ను సీఎంచంద్రబాబు గారు మొన్న పిలిపించి నా పనితీరుకు 66.4 శాతం మార్కులిచ్చారు. కాబట్టి నేనేమిటో నా ప్రజలకు తెలుసు’’ అని ఘాటుగా స్పందించారు.
ఈ నెల 19తేదీన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడం జరిగింది..హైదరాబాదు నుండి తిరుపతికి ఇండిగో విమానంలో వెళ్ళే క్రమంలో వైసిపి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ప్రయాణం చేశారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని సార్ బాగున్నారా అని అడిగాను.. బాగున్నాను అని చెప్పి వారు వెళ్ళిపోవడం మొత్తం కలిసి 8 సెకండ్స్ లోపే జరిగింది.
నేను తిరుపతి పర్యటన ఉండగానే సీఎం కార్యాలయం నుండి తనను రావలసిందిగా కబురు అందింది. మధ్యాహ్నం 3గంటల నుండి రాత్రి 10.40వరకు సీఎం కార్యాలయంలోనే ఉన్నాను, 40 నిమిషాల సేపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యాను. అదే రోజు రాత్రి అమరావతి నుండి తిరువూరుకు రావడం జరిగింది. నిన్న, ఈరోజు తిరువూరులోని అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందన్నారు.
వాస్తవాలకు విరుద్ధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజమండ్రిలో కలిసినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు..తప్పుడు ప్రచారం చేసేవారికి ఒకరోజు బియ్యం వస్తాయేమో కానీ, దాని గురించి ఏమీ రావన్నారు. సంవత్సరం కాలం నుండి దుష్ప్రచారాలు చేసినవారికి వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుసు. కేవలం ఈ వీడియో ద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తే దాన్ని స్పష్టం చేసేందుకే మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది.
కానీ దుర్మార్గం ఏంటంటే బొత్స సత్యనారాయణ, అయ్యన్నపాత్రుడు వాటేసుకుని నవ్వుతూ మాట్లాడిన వీడియోలు బయటికొచ్చాయి. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరు.
వాస్తవాలను వక్రీకరించే వారికి నేను చెప్పేది ఒకటే. మీరు ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినా కూడా తిరువూరు నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలు ఏంటో తెలుసు. సీఎం చంద్రబాబు మూడు రోజుల క్రితం పిలిచి సంవత్సరకాలంలో ఎమ్మెల్యేగా నా పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సీఎం చంద్రబాబు నా పనితీరు కు 66.4% మార్కులు ఇవ్వడం జరిగింది. తిరువూరు నియోజవర్గంలో అవినీతికి సంబంధించి 5.5% ఆరోపణలు ఉన్నట్లు ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా తెలిపారు.
నేను ఏం చేస్తున్నాను.. ఎలా పనిచేస్తున్నాను..నాకు తెలుసు. నా తిరువూరు ప్రజలకు తెలుసు. సీఎం చంద్రబాబు కూడా తెలుసు. ఇలాంటి గాలి వార్తలను పట్టించుకోవద్దని అందరికీ తెలియజేస్తున్నాను.