– అసలైన ఏకలవ్య పరదాల శిష్యుడు అనిల్
(చాకి రేవు)
పరదాల మధ్యలో వెళ్లే గురువు నుండి నేర్చుకొన్నాడు. ఆయన కోసం గురు దక్షిణగా నవమాసాలు గురు దక్షిణ కూడా సమర్పించుకొన్నాడు.
నెల్లూరు జిల్లాలో తొమ్మిది నెలలుగా జరిగిన ‘క్వార్ట్జ్ గని దోపిడీ’ కథ ఇది. ఒకప్పుడు ‘ఖనిజం అంటే దేశ సంపద’ కానీ.. అధికారంలోకి వస్తే ‘ఖనిజం అంటే మా వైకాపా ముఠా సంపద’ అని స్వైరవిహారం చేశారు.
ముఠా పరిచయం:
నాయకత్వం: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు. [S]
పర్యవేక్షణ: శ్రీకాంత్ రెడ్డి బిరదవోలు [S]
వసూళ్ల బాధ్యత: శ్రీకాంత్ రెడ్డి దువ్వూరు (వసూళ్ల బరువుకు జిమ్‌లో బాడీ పెంచిన జిమ్ శ్రీకాంత్ రెడ్డి) [S]
కార్యాలయ బాధ్యతలు: శ్యామ్ (సాముద్దీన్ – అంటే, క్వార్ట్జ్ దందాకు ఓ అద్దె ఆఫీస్!) [S].
డబ్బుల వసూళ్లు, బెదిరింపులు: సాకేత్ రెడ్డి, దిలీప్ రెడ్డి, (బెదిరించడంలో స్పెషలిస్టులు!) [S]
కె విశ్వనాథ్ సినిమాల పేర్లలో మొదటి అక్షరం లెక్కన, అనిల్ గారి ముఠాలో స్పెషాలిటీ చూశారా. ఐదు మంది పేర్లు ఎస్‌లతో మొదలవుతాయి. మళ్లీ ముఠాలో గురువు నామినేటెడ్ పోస్టులు ఇచ్చినట్లు గురువుగారి సామాజిక వర్గానికి ప్రాధాన్యత.
“ఎక్కడైనా తవ్వుకో… ఎంతైనా తవ్వుకో… ఎక్కడికైనా తరలించుకో… ఏ ధరకైనా అమ్ముకో… మాకు మాత్రం టన్నుకు రూ. 7 వేల నుంచి రూ.10 వేలు ముక్కుపిండి ఇవ్వాలి!” – ఇది క్వార్ట్జ్ ముఠా డైలాగ్. వింటుంటే, “ఇండియన్ మైనింగ్ మాఫియా యూనివర్శీటీలో” వీళ్ళకు పీహెచ్డీ డిగ్రీలు ఇచ్చారేమో అనిపించకమానదు!
చైనాలో క్వార్ట్జ్‌కు డిమాండ్ పెరగడం వీళ్ళకు జాక్‌పాట్. ‘అమ్మో చైనాకి వెళ్తుంది, మనకేం లాభం?’ అని ఆలోచించకుండా, ‘మన జేబులకు లాభం’ అని ఆలోచించిన వైకాపా నేతలు గేట్లు తెరిచేశారు. లీజులున్నా లేకున్నా, గడువు తీరినా తీరకున్నా, ఖనిజ నిక్షేపాలు వున్న ప్రదేశాలకే పరదాలు (గురువు దగ్గర శ్రద్దగా నేర్చుకొన్నది) కట్టి మరీ తవ్వేశారు!
నెలకు రూ.20 కోట్ల చొప్పున 9 నెలల్లో రూ.180 కోట్లు ‘ముఖ్యనేత’కు చేర్చారంటే… ఇది క్వార్ట్జ్ గని కాదు, నోట్ల గని! టోల్గేట్ల దగ్గర, దారిలో స్పెషల్ చెక్‌పోస్టులు పెట్టారంటే, ఏదో వీళ్ల కష్టాన్ని ఎవరో దోచుకుపోతున్నట్లు వీరి దోపిడీ సాగింది. నాటి పోలీసులు, గనులశాఖ అధికారులు వీళ్ళకు సంపూర్ణ సహకారం అందించారట.
ఎన్నికల ఫలితాలతో గప్‌చుప్ అయ్యారు!
ఇప్పుడు దర్యాప్తు చేస్తే, ఈ ‘క్వార్ట్జ్ కోటీశ్వరుల’ ముఠా వెనక ఉన్న ‘పెద్ద తలకాయలు’ బయటపడతాయట. అంటే, ఇంకా ఎంత మంది ‘క్వార్ట్జ్ వీరులు’ ఉన్నారో తెలియదన్నమాట!
పవిత్రమైన ప్రజాదేవాలయం లాంటి సభలో జిప్పు తీసి చూపించిన వీడి బలుపు తగ్గించి తీరాలి. కర్మ కూడా క్వార్ట్జ్ లాంటిదే. పైన మెరుస్తూ కనిపించినా, ప్రజా తీర్పుతో కొడితే 11 ముక్కలు అవుతుంది. ఏకాంతంగా.. పర్సెంటా అర పర్సెంటా లాంటి డైలాగులు మరిన్ని చిప్పకూడు తింటూ తీరికగా ప్రాక్టీసు చేసుకోవచ్చు.