– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు, వెంకటేశ్వరరావు
విజయవాడ: కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో రాష్ట్రాన్ని, ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రాజధాని అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు, వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు స్థానిక బాలోత్సవ భవన్ లో శుక్రవారం జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్ట్ )ఎన్టీఆర్ జిల్లా విస్తృత సమావేశం డి. కాశీనాథ్ అధ్యక్షతన జరిగింది. జిల్లా కార్యదర్శి డివి .కృష్ణ తదితరులు ప్రసంగించారు. సీపీఎం అగ్రనేత
అచ్యుతానందన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం బాబురావు, వెంకటేశ్వరరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, ఒత్తిడి చేసి అమరావతికి, రాష్ట్ర అభివృద్ధికి నిధులు తేవాలి. విభజన చట్ట ప్రకారం అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. 11 సంవత్సరాల కాలంలో నిధులు ఇవ్వకుండా కేంద్రం మొండి చెయ్యి చూపుతోంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా కేంద్రంపై కూటమి ఒత్తిడి చేయకపోవడం శోచనీయం.
అమరావతి ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం బిల్డప్ ఇస్తున్నది. 56 మండలాల్లో విస్తరించి ఉన్న సిఆర్డిఏ ప్రాంతాన్ని, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది, ఏ ఒక్క సమస్యను పరిష్కరించడం లేదు.