– 35 సంవత్సరాల్లో తొలిసారి స్వేచ్ఛాయుత వాతావరణంలో 11 నామినేషన్లు
– మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి
పులివెందుల: జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, నాయకులు ఇప్పటివరకు దాదాపు వంద కోట్లు ఖర్చు చేశారు. ఇంకా డబ్బులు పంచుతూనే ఉన్నారు. ముక్కుపుడకలు, చీరలు పంపిణీ చేస్తున్నారు. అవినీతి సొమ్ము ను పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారు.
జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి పోలింగ్ సిబ్బందిని బెదిరించారు. వైసీపీకి అనుకూలంగా చేయకపోతే వచ్చేది మా ప్రభుత్వమే మీ అంతు చూస్తానని పోలీసు అధికారులను బెదిరించారు. తొలుత ప్రలోభపెట్టారు. విననిపక్షాన బెదిరిస్తున్నారు. అనేక రకాలుగా దౌర్జన్యాలు చేశారు.
ఈ 35 సంవత్సరాల్లో తొలిసారి స్వేచ్ఛాయుత వాతావరణంలో 11 నామినేషన్లు వేయించి నేడు ప్రజాస్వామ్యయుతంగా పోటీకి దిగుతుంటే.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే వైసీపీకి ఓట్లు రావని టీడీపీ మీద ఇష్టమొచ్చినట్లు వారి సొంత మీడియా లో దుష్ప్రచారం చేశారు. పులివెందుల ప్రజలు అన్నీ గ్రహించారు. జరగబోయే పోలింగ్ లో ప్రజలు మావైపే ఉన్నారు.