– చేసుకున్నోడికి చేసుకున్నంత యహోవా
ఆయనది మనలాగా బ్రిటిష్ వారికి నాటుపంది మాంసం సప్లై చేసే కాంటాక్ట్స్ సంపాదించి…ఆది సప్లై చేసే ఓనర్ నే చంపేసి…ఆ కంపెనీ తో పాటు అతనికి ఉన్న మైన్స్ కూడా ఆక్రమించుకున్న చరిత్ర వున్న ఫ్యామిలీ కానే కాదు.
కొవ్వూరు తాలూకాలో ఇంట్లో వున్న అయిదుగురు అన్నదమ్ముల్లో ఒకరు. సీఏ, ఇద్దరు డాక్టర్స్, ఒకరు ఇంజనీరు, ఇంకొకరు కామర్స్ గ్రాడ్యుయేట్లు అయిన ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఆయన రంగరాయ మెడికల్ కాలేజీ లో డాక్టర్ చదివి జియోగ్రఫీ, అంత్రోపాలజీ ఆప్షనల్స్ తో 120 వ ర్యాంక్ తో యూపీఎస్సీ క్రాక్ చేసిన వ్యక్తి.
2014 ఎలక్షన్స్ లో ప్రచార సమయం అయిపోయాక కూడా ప్రచారం చేస్తుంటే మంత్రి బొత్స మేనల్లుడు మజ్జి శీను నీ అరెస్టు చేయబోయారు. బొత్స అడుక్కుంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు! 2019 ఎలక్షన్స్ లో ప్రకాశం ఎస్పీ గా చీరాల మాజీ ఎమ్మల్యే ఆమంచి కి చుక్కలు చూపారు. వున్న 49 రోజుల్లోనే….జిల్లాకి, స్టేషన్ కి ఒకడే రౌడీ ఉండాలి..వాడు కూడా ఎస్పీ నో, ఎస్సై నో అయి ఉండాలి అని ఆమంచి రౌడీయిజాన్ని అడ్డుకున్నారు.
జగన్ రెడ్డీ నువ్వు గెలవగానే…కక్ష తో 16 నెలలు వీఆర్ కి పంపి, జీతం లేకుండా చేస్తే…పోస్టింగ్ కోసం ఎవడిని బతిమిలాడకుండా…సొంత వూరు పోయి వ్యవసాయం చేసుకున్న గుండె ఆయనది.
నువ్వు ఎంత యాక్షన్ చేసినా ఆ జడ్పీటీసీ డిఐజీ ఎవరో నీకు, నీ పార్టీ కి తెలుసు. నీ అయిదేళ్ల పదవీ కాలంలో నాన్ ఫోకల్ పోస్ట్స్ లో పడేసి వేధించిన చరిత్ర నువ్వే మరిస్తే ఎలా ?
ఆయన ఎవరికి అల్లుడు వరస అని చెబుతున్నావో ఆయన (గరికపాటి మోహనరావు గారు) 2019 లోనే టీడీపీ వదిలి బీజేపీలో చేరాడని ఎందుకు మర్చిపోయినట్లు నటిస్తున్నావు ? గతం చెప్పినంత తేలికగా, వర్తమానం చెప్పడానికి భయమా లేక తడిచి పోయిందా ?
నువ్వు సీఎం గా వున్నపుడు నీ చుట్టూ అంతా మన జిల్లా వాళ్ళు, మనోళ్లే గా జగన్ రెడ్డి ?
కడప కి చెందిన ధనుంజయరెడ్డి, సీఎంఓ లో జవహర్ రెడ్డి సీఎస్ గా, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి జూనియర్ అయినా 8 మందిని సీనియర్ ఐపిఎస్ లని తొక్కి డీజీపీ గా, సజ్జల రెడ్డీ సలహాదారుగా చుట్టూ పెట్టుకుని బతికి ఇప్పుడు నీతులు మింగితే జనం వేరే దాంతో నవ్వుకుంటారు ఎంఎల్ఏ గారూ?
ఓ రెండు జడ్పీటీసీ లకే ఇంతలా గింజుకుంటే…ఏడాదిలో రాబోయే మొత్తం లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో ఇంకెంత ఏడవాల్సి వస్తుంది ?
అయినా నాకు తెలియక అడుగుతా జగన్ రెడ్డి…గత 35 ఏళ్ల పాటు పులివెందులలో జరిగిన అన్ని లోకల్ బాడీ ఎన్నికల్లో అస్సలు నామినేషన్లు వెయ్యనివ్వకుండా చేసిన నువ్వే నా.. పెజాస్వామ్యం గూర్చి వల వల ఏడుస్తుంది ?
నీవు నేర్పిన విద్య యే నీరజాక్ష ” అని మనం చెప్పిన పాఠాలు మనకే తిరిగి ఒప్ప జెప్పే రోజులు వస్తాయి అని అస్సలు ఊహించి ఉండవు కదూ…అదీ డిసిప్లిన్డ్ కి మారు పేరు అయిన టీడీపీ నుంచి ఈ రేంజ్ షాక్ ఇచ్చిందా నీకు…ఇప్పుడు బాబు తరం పోయి…లోకేష్ బాబు తరం వచ్చింది…నువ్వు 2 చేస్తే…ఇటు నాలుగున్నర చెయ్యటానికి సిద్ధం.
నీకు ఇంకా అర్థం అయ్యేట్లు చెప్పాలంటే “చేసుకున్నోడికి చేసుకున్నంత యహోవా” అన్నారు పెద్దలు.
– బిబి