కాకినాడ: రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు మంగళవారం ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన తనయుడు సూర్య సానా హాజరయ్యారు.
ముందుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించి సానా సతీష్ బాబు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సర్వమత పెద్దలు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆశ్రయ జిల్లా వికలాంగుల సమాఖ్యకు చెందిన సుమారు 500 మంది విభిన్న ప్రతిభావంతులకు రేషన్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి మాట్లాడుతూ, “సానా సతీష్ బాబు జన్మదినాన్ని పేద ప్రజలకు సేవ చేసే విధంగా పలు సేవా కార్యక్రమాలకు అంకితం చేయడం జరిగిందన్నారు.. ఉదయం నుంచే ఆయన అభిమానులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు” అని తెలిపారు. పేద విద్యార్థులకు నోటుబుక్స్, మహిళలకు కొత్త వస్త్రాలు, రేషన్ కిట్లు, దుప్పట్లు పంపిణీ చేస్తూ ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందజేశారని అన్నారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, ప్రజలు హాజరై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కు శుభాకాంక్షలు తెలిపారు. “సానా సతీష్ బాబు నాయకుడిగా కాకుండా ప్రజలకు సేవకుడిగా నిలుస్తున్నారు. జిల్లాలోని సమస్యలను పార్లమెంట్లో గళం వినిపించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు” అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అరిగెల శ్రీనివాస్ (బున్ని), నులుకుర్తి వెంకటేశ్వరరావు, చింతపల్లి అర్జున్, న్యూటన్ ఆనంద్ పెంకె శ్రీనివాస్ బాబా, వి.య్. దాసు, నెక్కంటి శ్రీనివాస్, గింజల శ్రీనివాస్, డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు,బీజేపీ నాయకులు వై. మాలకొండయ్య, డా. అడ్డాల సత్యనారాయణ, గంజి గోపి, బొబ్బిల గోవిందు, కాకరపల్లి చలపతిరావు, సీతయ్యదొర , లీల ప్రశాంతి, దేవ్ వెంకన్న,టిడిపి బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర నాయకులు బావిడిపార్టీ శ్రీకృష్ణ, ప్రతిపాడు అధ్యక్షులు హనుమంతు ప్రసాద్, వెంకటరమణ, రామచంద్రపురం అధ్యక్షుడు రామచంద్రరావు,,సంజయ్ నగర్ నుండి రాయుడు దుర్గ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలు తరలివచ్చారు.