– సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి
పరవాడ: ప్రముఖ కార్మిక ఉద్యమ నేత కాంగ్రెస్ పార్టీ నాయకులు కే ఎస్ ఏ రామినాయుడు మృతి ఈ ప్రాంత ప్రజల కి తీరని లోటు అని సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ అన్నారు. బుధవారం రామయ్యనాయుడు భౌతికాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎన్టిపిసి కార్మిక నాయకులు పరవాడ మండలంలో అనేక కార్మిక సమస్యల పరిష్కారం కోసం బొగ్గు లారీలు కాలుష్యంపై అఖిలపక్ష ఉద్యమాల నిర్వహించిన చిట్ట చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ రాజకీయాలకు నిబద్ధతతో కూడిన రాజకీయాల నిర్వహించిన మహోన్నతమైన వ్యక్తిని గని శెట్టి అన్నారు. కార్మిక నేతలు బొద్ధపు. చిన్నారావు, రామయ్యనాయుడు సోదరులు రామారావు తదితరులు ఉన్నారు