శ్రీశైలం: రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ సిబ్బందిని అడ్డుకుని చెక్ పోస్ట్ వద్దే శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. సిబ్బంది తనను కలవడానికి రావడం లేదని.. రోజు తన ఇంటికి వచ్చి హాజరు వేయించుకోవాలని హెచ్చరించారు. మీ అంతు చూస్తా అంటూ సిబ్బందిపై ఎమ్మెల్యే దుర్భాషలాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల నుంచి వాహనం లాక్కుని.. వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకుని శ్రీశైలం అంతటా బుద్దా రాజశేఖర్ రెడ్డి తిప్పారన్నారు.
అనంతరం తన గెస్ట్ హౌస్‌కి తీసుకువెళ్లి అనుచరులతో కలిసి సిబ్బందిపై దాడి చేశారని, ఎమ్మెల్యేనే తమపై దాడి చేస్తే, తాము ఎలా విధులు నిర్వహించాలని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేశారు. ఫారెస్ట్ అధికారులు రామానాయక్, గురవయ్య, మోహన్ కుమార్, కరీముల్లాలపై దాడి జరిగిందని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.