– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి: స్థానిక ఎల్ పి రోడ్ లోని ఎస్సీ బాలికల హాస్టల్‌ను గురువారం తెలుగుదేశం పార్టీ దర్శి ఇన్‌ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లు, డ్రైనేజీ, ఫ్లోరింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రారంభించిన ఈ పనుల పురోగతి లేకుండా ఎందుకు నిలిచిపోయాయని సంబంధిత కాంట్రాక్టర్లను వివరణ కోరారు.
ఎస్సీ బాలికల పాఠశాలలో బాలికలు ఉంటున్న వసతి గదులను, వాష్ రూమ్స్, వంటశాలను స్వయంగా పరిశీలించి వసతులను మెరుగుపరచాలని ఆమె కోరారు. ఎస్సీ బాలికల పాఠశాల స్థితిగతులపై కలెక్టర్ ఆన్సారి కి వివరిస్తానని ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మీడియాకు తెలిపారు.
ఈ కార్యక్రమం లో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షుడు చిన్నా, టిడిపి నాయకుడు సానే సుబ్బయ్య, వాసు, జూపల్లి కోటేశ్వరరావు, శ్రీనాథ్ తదితర నాయకులు ఉన్నారు.
మహిళా రైతులతో డాక్టర్ లక్ష్మి మాటామంతీ!
ముండ్లమూరు మండలం, ఉల్లగల్లు గ్రామంలో గురువారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పొలాలలోకి వెళ్లి రైతులతో కలిసి వరినాట్లు వేసి వారితో ముచ్చటించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది… వర్షాలు తగినంతగా కురిశాయి… డ్యాములు నిండాయి… కూటమి పాలనలో మంచి చేయాలన్న సంకల్పం ఉన్న నేతలకు తోడు వరుణు దేవుడు కూడా కరుణించాడని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబ పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ఏం చదువుతున్నారు తల్లికి వందనం వచ్చిందా.. మీకు పెన్షన్ వస్తుందా ఇలా ప్రభుత్వ పథకాలు ఏవేవి మీకు అందుతున్నాయి? అని ఆరా తీశారు.