– కదిరి ప్రభుత్వాస్పత్రిలో దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం
– సాక్షాత్తూ అరోగ్య శాఖ మంత్రి జిల్లాలోనే ఆస్పత్రుల్లో కొరవడిన రక్షణ
– వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ డిమాండ్
విజయవాడ: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందిపై టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా దాడి చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఈ దుర్ఘటనను తీంగా ఖండిస్తున్నా. స్వయంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ఆస్పత్రికి వెళ్లి ఇంత ఘోరంగా మూకుమ్మడి దాడికి పాల్పడి వైద్యులు, సిబ్బంది, రోగులను భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గం.
రాష్ట్రంలో రోజురోజుకూ దిగజారుతున్న శాంతిభద్రతల కు ఈ ఘటన పరాకాష్టగా నిలిచింది. వెంటనే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు స్పందించి ఘటనాస్థలాన్ని పరిశీలించి బాధిత వైద్యులు, సిబ్బందికి అండగా నిలవాలి. మరోసారి ఇటువంటి ఘటనలు మరెక్కడా జరగకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
వైద్యులు, వైద్య సిబ్బంది రక్షణకు చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి. లేకపోతే వైద్యులు అందరం కలిసి రాష్ట్ర వ్యాపిత ఉద్యమానికి సిద్ధం అవుతాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.