– ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు ఫిర్యాదు
అమరావతి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ని కించపరుస్తూ కథనం రాసిన సాక్షి దిన పత్రిక ఎడిటర్‌పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎడిటర్‌తోపాటు క్రైమ్ బ్యూరో చీఫ్, ఇతర సిబ్బందిపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు.
డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కించపరుస్తూ, ఆయన లక్ష్యంగా చేసుకుని అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జనకుల శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు వీరిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.