(పీటర్ )
షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఒక పాస్టర్.. షర్మిల కొడుకు రాజారెడ్డి కూడా పాస్టర్ అయ్యాడు. తండ్రి బాటలో బైబిల్ ప్రసంగాలు చెప్తున్నాడు. చాలామంది లోటస్ పాండ్ లో జగన్ కట్టుకున్న ఇంటి మీద జీసస్ మీద భక్తితో శిలువ గుర్తు వేసుకున్నాడు అనుకుంటారు.
కానీ శిలువ గుర్తు ఉన్న బిల్డింగ్ పోర్షన్ షర్మిల ఉండే ఇల్లు.
ఆ పక్కన ఉన్న పోర్షన్ జగన్ ది. షర్మిల కుటుంబం ఎప్పుడూ ప్రార్థనలో ఉంటారు. షర్మిల కుటుంబం వారి జీవితాలను పూర్తిగా దేవుడికి అంకితం చేసుకున్నారు. ఏ మతస్థులు అయినా వాళ్ళ జీవితాలను దేవుడికి అంకితం చేసుకుంటే, వాళ్ళు దేవుడి మీద భక్తితో, భయంతో చాలావరకు తప్పులు, పాపాలు చేయకుండా జీవిస్తారు. కాబట్టి షర్మిల లైఫ్ స్టైల్ ప్రకారం వాళ్ళు తప్పులు చెయ్యని మంచి జీవితం జీవిస్తున్నారు అనుకోవచ్చు.
కానీ చాలామంది అమాయక క్రైస్తవులు జగనే నిజమైన క్రిస్టియన్ అనుకుంటారు. షర్మిల.. జగన్ తో విభేదించిన కారణంగా షర్మిల భర్త మీద కావాలని నిందలు వేశారు. ఎక్కడో కంపెనీ పెట్టుకోడానికి ప్రభుత్వ భూములు అడిగితే ఇవ్వలేదు అని.. జగన్ మీద కక్ష పెంచుకున్నారు అని.. వైసీపీ పెయిడ్ మీడియా ద్వారా ప్రచారం చేశారు.
నిజానికి షర్మిల తన పిల్లలకు రావలసిన ఆస్తుల విషయంలో జగత్ తో విభేదించారు తప్ప, ఎక్కడా ప్రభుత్వ భూములు కొట్టేసే ఉద్దేశంతో మాత్రం కాదు. జగన్ నిజంగా ఎవరిని అవినీతి చేయనివ్వని వ్యక్తి అయితే.. మద్యపాన నిషేధం హామీ ఇచ్చిన అతను లిక్కర్ పాలసీ రాజ్ కేసిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, విజయసాయి రెడ్డి చేతుల్లో పెట్టి వేలకోట్లు అవినీతి ఎందుకు చేసుకోనిస్తాడు?
ఇసుక మీద వేల కోట్లు ఎలా దోచుకున్నాడు? ఫోటోగ్రాఫర్ అయిన నందిగం సురేష్ ఎంపీగా వందలకోట్లు ఎలా సంపాదించ గలిగాడు? ఇలా ఎంతోమంది వైసీపీ నేతలను దర్జాగా దోచుకోనిచ్చిన జగన్, సొంత చెల్లి షర్మిల దగ్గరకు వచ్చే సరికే అవినీతిని ఆపాలని అనుకున్నాడా? కాబట్టి షర్మిల భర్త అనిల్ ప్రభుత్వ భూములు అడిగితే ఇవ్వలేదు అని ఎదురు తిరిగారు అనేది పూర్తి అబద్ధం.
ఒక ఇంటర్వ్యూలో అనిల్ చెప్పాడు.. నువ్వు ఈ పాస్టర్ పని మానెయ్యి, బైబిల్ ప్రసంగాలు చెప్పడం ఆపివెయ్యి. నీవలన నాకు బీజేపీ దగ్గర చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అని తనతో జగన్ చెప్పినట్టుగా చెప్పాడు.
నిజమైన క్రిస్టియన్ చివరి శ్వాస వరకు జీసస్ కోసం జీవిస్తాడు. కానీ కేసులకు భయపడి హిందువు అవతారం ఎత్తి, పూజలు చేస్తూ తిరిగి చాలా ఏళ్లుగా బావ చేస్తున్న పాస్టర్ పనిని ఆపేయమని చెప్పిన జగన్ ఏవిధంగా క్రిస్టియన్ అవుతాడో ఒకసారి క్రిస్టియన్ సోదరులు ఆలోచించుకోండి. జగన్ దైవ భక్తి, దైవ భక్తి ఉన్నవాడు అయితే డబ్బు మీద వ్యామోహంతో అంత అవినీతి చేస్తాడా?
సొంత బాబాయిని చంపిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాడా? ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన వాళ్ళని చంపేస్తాడు? దొంగ కేసులు పెట్టి జైల్లో వేస్తాడా? నిజాయితీగా గెలవాలని కాకుండా దొంగ ఓట్లతో దొంగ దారిలో మోసం చేసి గెలవాలని లక్షల దొంగ ఓట్లు చేర్పిస్తాడా? అసలు బావని పాస్టర్ పని మానేయమని చెప్తాడా? ఎన్నో విషయాల్లో బైబిల్ కి విరుద్ధంగా ప్రవర్తిసాడా? జగన్ రెడ్డి ట్రాప్ లో ఉన్న క్రిస్టియన్లు ఒకసారి ఆలోచన చేయండి.