*సమాచార పౌర సంబంధాల శాఖ ఆర్ జె డి కస్తూరి తెల్లా
విజయవాడ: జర్నలిస్టులు, సమాచార పౌర సంబంధాల శాఖ వేరు కాదని, రాష్ట్ర ప్రగతికి కలిసి పని చేద్దామని ఆ శాఖ అధికారిణి ఆర్ జె డి కస్తూరి తెల్లా పేర్కొన్నారు. హోటల్ ఐలాపురం శ్రీరామ ఫంక్షన్ ప్యాలెస్ లో జరిగిన నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) జాతీయ కార్యవర్గ సమావేశాలు సంఘ అధ్యక్షుడు సురేష్ శర్మ అధ్యక్షతన రెండు రోజులు పాటు ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశాల్లో 18 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ముగింపు సమావేశాలకు ఆమెముఖ్య అతిథిగా కస్తూరి తెల్లా పాల్గొని ప్రసంగించారు. సమాచార శాఖ అధికారిణి గా ఇంకా పది సంవత్సరాల సర్వీస్ ఉందని, జర్నలిస్టులతో కలిసి పనిచేసే సదావకాశంగా భావిస్తానన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, ఆ శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషిచేస్తున్నారన్నారు.జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అందజేయాలనే సంకల్పంతో ఉన్నారన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నేషనల్ మీడియా ప్రతినిధులను ఆమె చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.
ఎన్ యు జె (ఇండియా) అధ్యక్షులు సురేష్ శర్మ మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్ యు జె (ఇండియా) నిరంతర పోరాటం చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో విస్తరించిన నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) పాత్రికేయులకు అండగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో సీనియర్ జర్నలిస్టులు, వివిధ రంగాల్లో సామాజిక సేవ చేస్తున్న ప్రముఖులకు ఎన్ యు జె జీవిత సాఫల్య పురస్కారాలు అందజేయడం జరిగింది.
పురస్కారాలు అందుకున్న వారిలో కోసూరి మాధవ కృష్ణ, తోట భవన్నారాయణ, సమ్మెట్ నాగమల్లేశ్వరరావు, డాక్టర్ సిహెచ్ దుర్గానాథ్, తాడి రంగారావు, పెద్దిరాజులు, పారిశ్రామికవేత్త అశ్విన్, బాలగంగాధర్ తిలక్, శివ కేశవరావు, పాలవెల్లి మధు, సారంగపాణి అయ్యంగార్, జీవి రాజగోపాలరావు, చలసాని ఆంజనేయులు, వరద నాగేశ్వరరావు, సాయిబాబు తదితరులు ఉన్నారు. పలువురు మహిళా జర్నలిస్టుల ఉత్తమ సేవలకు గాను గౌరవ పురస్కారాలు అందజేయడం జరిగింది.
ఇంకా కార్యక్రమంలో పెన్ సంఘ నేతలు, బడే ప్రభాకర్, సింహాద్రి కృష్ణ ప్రసాద్, గరికిపాటి శివ, బద్దం సుమలత, కృష్ణాజిల్లా అధ్యక్షులు గడ్డిపాటి సుధీర్, అప్పికట్ల శ్రీనివాస్, బీడీ ఆర్ ప్రసాద్, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, అన్నం శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.