– ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రజాసేవ కోసం పెట్టరు కదా?
– వాటిపై ప్రభుత్వ నియంత్రణ అసాధ్యం
– ఆపడం అందరి కర్తవ్యం
8000 కోట్లు ఖర్చుపెట్టలేక 70,000 కోట్లు ఆస్తులు ఉన్న వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తుంది మన ప్రభుత్వం. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఒక సామాన్యుడు ఒక చిన్న ఉద్యోగి ఏదన్న రోడ్డు మీద వెళుతూ ఉంటే.. యాక్సిడెంట్ జరిగి కాలు గాని చేయి గాని విరిగితే.. లేక తెలియని అనారోగ్యం కలిగితే కనీసం ఐదు లక్షల నుంచి పది లక్షల ఖర్చు అవుతుంది.
అతడు ఆరోగ్యం బాగు చేసుకోవడానికి ఉన్న గుడిసో, ఉన్న పెంకుటిల్లును, ఉన్న ఒక సెంటు, రెండు సెంట్లు పొలం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు అనారోగ్య కారణాలతో అత్యవసర పరిస్థితిలో ఐసీయూలో చేరితే రోజుకి 25,000 నుంచి 50,000 ఒక్క రోజుకి అలానే మెడికల్ టెస్ట్ లు, స్కానింగ్ లు, ఎక్స్ రేలు అదనపు ఖర్చులు ఈ హాస్పిటల్స్ వసూలు చేస్తున్నాయి.
అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అవసరమైంది. ఈరోజు పది మెడికల్ కాలేజీలకు 8 వేల కోట్ల అవసరమవుతుంది. 8000 కోట్లు అంటే ప్రతి ఆస్పత్రికి కేవలం 800 కోట్లు మాత్రమే ఖర్చయ్యేది. 800 కోట్ల హాస్పిటల్ ఖర్చు పెట్టలేక 70,000 కోట్ల ఆస్తులు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేస్తున్నారు.
మన ప్రభుత్వం దీన్ని మనందరం ఖండించకబోతే మనకు రాబోయే రోజుల్లో సామాన్యుల కి ఆరోగ్యం అనేది అందని ద్రాక్ష లాగా ఉంటది. 70 వేల కోట్ల ఆస్తులు ఎవరి జేబులోకి వెళ్తాయి? ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు పొందిన వాళ్ళ జేబుల్లోకి వెళ్తాయి. మనం ఈ వాట్సాప్ ఈ గ్రూపు ద్వారా చాలా మంది పేదవారికి ఆరోగ్యం బాగాలేదంటే సాయం చేస్తూ వస్తున్నాము.
అది ఏ రూపం అంటే తలా ₹1౦౦౦, తలా 2000 , తలా రూపాయలో 5000 ఎన్నోసార్లు సహాయం చేసి ఉన్నాము. ఈ గ్రూపు ద్వారా అంటే సామాన్యులకి అలానే పేదవారికి .. ఇలా అయితే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అనేవి లేకపోతే రాబోయే రోజుల్లో రాష్టంలో హెల్త్ విషయంలో చాలా దయనీయ పరిస్థితుల్లో ఉంటాయి.
ఆంధ్ర ప్రజలారా అందరూ ఒకసారి ఆలోచించండి. నా ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలారా నేను ఈ మెసేజ్ రాయటానికి కారణం ఏందంటే నేను మన తెలంగాణ , ఆంధ్ర రాష్ట్ర విడిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఈరోజు కూడా అంతే బాధపడుతూ… ఆరోగ్యం సామాన్య ప్రజలకు దూరం అవుతుందని ఈ మెసేజ్ రాస్తున్నాను. మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ ప్రైవేటు పరం అవుతున్నాయని ఆవేదన.. ఈ ప్రయత్నం ఆగాలని ఆశతో..
– డి .బాజీ సైదా
B.SC (AG)
గుంటూరు
800 860 58 39.