– ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ఖర్చు ఆదా
విజయవాడ: నక్షత్ర హోటల్ లో రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన విద్యార్థి నాయకులు తో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అభియాన్ రాష్ట్ర కన్వీనర్ వేటుకూరి సూర్య నారాయణ రాజు అధ్యక్షత వహించారు.
సమావేశంలో ముఖ్య అతిథిలు బిజెపి జాతీయ కార్యదర్శి అనిల్ ఆంటోనీ, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం లు హాజరై మాట్లాడుతూ .. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి కొత్త కాదని స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 1967వరకు దేశం లో అసెంబ్లీ, పార్లమెంటు కు ఏకకాలంలో ఎన్నికలను నీర్వహించారు
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రాష్ట్ర లలో అప్రజాస్వామికం గా ప్రభుత్వాలను కూల్చి వేయడం వల్ల దేశం లో ఎమర్జెన్సీ ని విధించడంవల్ల ఏక కాలంలో జరిగే ఎన్నికలు నిర్వహించక పోవడం వల్ల ఎన్నికలు నిర్వహణలో తారతమ్యాలు ఏర్పడ్డాయి.
ప్రతి సంవత్సరం ఎన్నికల ను ఏదో రాష్ట్రం లో జరగడం వల్ల ఉద్యోగులు ఎన్నికల నిర్వహణకే భాద్యతలు పరీమితం అవుతున్నాయి, ఎన్నికల కోడ్ వల్ల దేశం లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచి పోతున్నాయి. అదేవిధంగా ఏక కాలంలో ఎన్నికలు జరగకపోవడం వల్ల ప్రజాధనం అధికంగా ఖర్చు అవుతోంది. ఏక కాలంలో ఎన్నికలు జరిగితే ఖర్చు ఆదా చేసుకుని ఆ సొమ్ము ను ప్రజావసరాల కు వాడొచ్చని వారన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజేషనల్ సెక్రటరీ మధుకర్ జీ,యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి,పూర్వ అధ్యక్షుడు మిట్టా వంశీ, విద్యార్థి నాయకులు మాల్యాద్రి యాదవ్,నాగోతు హరికృష్ణ, నవనీత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు