• మాజీ ఎమ్మెల్యే మేడా ప్రమేయంతో ఆన్లైన్లో అక్రమ ఎంట్రీ
• భూమన రాజకీయ కక్షకు బలైన లడ్డూ కౌంటర్ కార్మికులు
• అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు కోట్ని బాలాజీ, రవి నాయుడు
మంగళగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తుమ్మలగుంట గ్రామానికి చెందిన ఎన్. కేశవులు గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. పేరూరు గ్రామదాఖలా సర్వే నెం.24/బి విస్తీర్ణం భాగ పరిష్కారం 0.33 సెంట్లు ఆయకట్టు విస్తీర్ణం 0.13 సెంట్లు భూమి ఉందని తెలిపారు. ఈ భూమిని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోదరుడు చెవిరెడ్డి రఘునాథ రెడ్డి పేరుతో ఆన్ లైన్ లో అక్రమంగా నమోదు చేసుకున్నారు. ఇది మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రమేయంతో జరిగింది. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు అనకాపల్లి డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవి నాయుడులకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
అన్నమయ్య జిల్లా, నందలూరు మండలం, ఇసుకపల్లి గ్రామానికి చెందిన భూమిరెడ్డి రాజమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. పాటూరు పంచాయతీలోని సర్వే నెం. 1102/1లో ఖాతా నెం. 365 కింద తమ పేరున ఉన్న 2.36 ఎకరాల భూమిని మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి అక్రమంగా పెనగలూరు కాంతమ్మ పేరు మీద ఆన్లైన్లో మార్చారు. ఈ అన్యాయంపై గతంలో అప్పటి తహసీల్దార్ దార్ల చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారిపై చర్యలు తీసుకుని తమ భూమిని తిరిగి తమ పేరు మీద మార్చాలని కోరారు.
తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన ఏ.కన్నయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. 1994 నుంచి తిరుమలలో లడ్డూ కౌంటర్లో కాంట్రాక్టు వర్కర్‌గా పనిచేస్తున్నాం. అయితే, గత ప్రభుత్వ కాలంలో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయ కారణాలతో తమను విధుల నుంచి తొలగించారని తెలిపారు.
ఈ అన్యాయంపై తిరుపతి కోర్టు, హైకోర్టును ఆశ్రయించగా మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ భూమన కరుణాకర్ రెడ్డి వాటిని అమలు చేయలేదు. టీఎన్టీయూసీకి తాము సభ్యులమని, అలాగే భూమనకు ఓటు వేయలేదని కారణం చూపి తమ అర్జీలను కూడా తిరస్కరించారు. కావునా తమ సమస్యను పరిష్కరించి తిరిగి టీటీడీలో విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
అన్నమయ్య జిల్లా, పెద్దమండెం మండలం రెడ్డివారిపల్లె గ్రామానికి చెందిన చంద్రకళ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో ఖాతా నెంబర్ 1795లో సర్వే నెంబ.402లో వంశపారపర్యంగా 7.96 భూమి కలదు. ఇందులో తమ మామ తమ మేనఅల్లుడైనా సుబ్బరాయుడు(లేటు)కు 3.97 సెంట్ల భూమిని దానంగా ఇచ్చాడు. ఈయన గత వైసీపీ ప్రభుత్వంలో మంచి భూమిని ఆక్రమించి తమకు పనికిరాని రాళ్ల, ఊట భూమిని ఇచ్చారు.
గత ప్రభుత్వంలో దీనిపై ప్రశ్నించినందుకు రేషన్ కార్డు తీసేసి ప్రభుత్వ పథకాలు రాకుండా చేశారు. 1988 నుండి తమ మామపేరుతో ఉన్న సర్వీస్ ను 2022లో మార్చేశారు. ఎన్నో అడ్డంకులు సృష్టించి ఇబ్బందులు పెట్టారు. వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించారు