– ఆయనది హిందూ జాతో.. సంకర జాతో.. సైంధవ జాతో తెలీదు
– భూమన హిందూ ముసుగులోని ఓ క్రైస్తవుడు
– టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతీసి క్రైస్తవం వైపు మరల్చాలన్నదే భూమన అసలు లక్ష్యం
– భూమన పాపాలకు బలైన వైఎస్, ధర్మారెడ్డి
– స్క్రాప్- శిల్పానికి తేడా తెలియని అజ్ఞాని
– ఇకపై ఆయన బ్రదర్ కరుణాకర్‌రెడ్డి!
– జగన్.. నిన్ను భూమన ముంచేస్తాడు జాగ్రత్త
– నిత్యం వెంకన్నను విమర్శిస్తే నీ పార్టీకి హిందువులెలా ఓటేస్తారు?
– టీటీడీ మాజీ చైర్మన్ భూమనపై విరుచుకుపడ్డ మాజీ టిటిడి పాలకమండలి సభ్యుడు, బలిజనాడు కన్వీనర్ డాక్టర్ ఓ.వి.రమణ
తిరుపతి: భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్తుడే. బ్రదర్ కరుణాకర్ రెడ్డి అని ఇక నుంచి పిలవాలి. భూమనకు మహావిష్ణువు విగ్రహానికి, స్క్రాప్ – శిల్పానికి మధ్య తేడా తెలియని అజ్ఞాని. బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద ఉన్నది స్క్రాప్ శిల్పం.
భూమనకు నిజంగా హిందూ ధర్మంపై నమ్మకం ఉంటే, లింక్ బస్టాండ్ వద్దనున్న శిల్పంను తన ఇంట్లో పెట్టుకుని నిత్యకైంకర్యాలు చేయాలి.
సంప్రదాయాలు, ఆచారాలతో భూమన వ్యాపారం చేశాడు. కార్పొరేట్ దళారీలను పెంచి పోషించింది భూమన. భూమన హయాంలో ఎఎడి టిక్కెట్లను విక్రయించి కోట్లు సంపాందించారు. కళ్యాణోత్సవం పేరుతో కమిషన్లు నొక్కారు. దేవుడి నగలతో ఎగ్జిబిషన్ పెట్టాలన్న దుర్భుర్థి భూమనకే సాధ్యం. కేవలం రాజకీయ లబ్ధి కోసం టిటిడిని భూమన వాడుకుంటున్నాడు. జగన్ ప్రోద్బలంతోనే భూమన టిటిడిపై దుష్ప్రచారం చేస్తున్నాడు.
స్క్రాప్- శిల్పానికి తేడా తెలియని అజ్ఞాని. అది పాతికేళ్లుగా అక్కడే పడి ఉంది. ఈ మధ్యలో కరుణాకర్‌రెడ్డి రెండుసార్లు చైర్మన్‌గా పనిచేశారు. మరి అప్పుడెందుకు దానిని గుర్తించలేదు? ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది? శిల్పులు ఒక విగ్రహం చెక్కినప్పుడు స్క్రాప్‌ను పక్కన పడేస్తారు. ఇదీ అంతే! అది కూడా తెలియని అజ్ఞాని టీటీడీ చైర్మన్‌గా పనిచేయడం హిందువుల దౌర్భాగ్యం.
గతంలో టీటీడీ చైర్మన్లుగా, చివరకు గంగమ్మతల్లి ఆలయ చైర్మన్‌గా పనిచేసిన వారు కూడా ఎప్పుడూ వారు పనిచేసిన దేవాలయంపై విమర్శలు చేయలేదు. ఆ ఘనత ఒక్క కరుణాకర్రెడ్డికే దక్కుతుంది. ఎందుకంటే ఆయన హిందువు కాదు. అన్యమతస్థుడు కాబట్టి! నిజమైన హిందువయితే ఎవరూ వెంకన్న ఆలయంపై విమర్శలు చేయరు. దేశంలో కొన్ని వేల పాలకమండళ్లు ఉన్నా, ఎవరూ తాము పనిచేసిన ఆలయాలపై విమర్శలు చేసిన దాఖలాలు లేవు.
హిందువుగా చెప్పుకుంటున్న నువ్వు నిరంతరం హిందువులపై, వెంకటేశ్వరస్వామిని విమర్శించేవాడివి హిందువెట్లా అవుతావు? వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, హిందువుల్లో ఆయనపై ఉన్న నమ్మకాన్ని చంపడం ద్వారా, వారిని క్రైస్తవం వెపు మళ్లించాలన్నదే నీ అసలు కుట్ర.
నువ్వు క్రైస్తవ భాషలో చెప్పాలంటే ఒక సైతాన్. నువ్వు బ్రదర్ కరుణాకర్‌రెడ్డి! క్రైస్తవ ఆచారాలతో నీ ఇంటి వ్యవహారాలు జరుపుకున్నావు. నువ్వు హిందూ ముసుగులో ఉన్న క్రైస్తవుడివి. క్రైస్తవ రూపంలో ఉన్న బ్రదర్ కరుణాకర్‌రెడ్డి కరుణామయుడా.. దయచేసి మా గుడి జోలికి రావద్దు.
నువ్వు చేసిన పాపాల వల్లే మహానుభావుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ శేషాచలం కొండల్లోనే కన్నుమూశారు. నీ పాపం వల్ల ఏమాత్రం అవినీతి మచ్చ లేని ధర్మారెడ్డి ఎలాంటి శిక్ష అనుభవించారో చూశారు. నీకూ శిక్ష తప్పదు. వెంకటేశ్వరస్వామితో పెట్టుకున్న ఎవరూ తప్పించుకోలేరు.
నేనూ గతంలో జగన్ పార్టీలో పనిచేశాను కాబట్టే చెబుతున్నా. జగన్ ఇంకా పదికాలాలపాటు రాజకీయాల్లో ఉండాలనే కోరుకుంటున్నా. ఈ కరుణాకర్‌రెడ్డి వల్ల వైసీపీ భ్రష్టుపట్టిపోతోంది. జగన్‌ను విలన్‌గా చూపిస్తున్న భూమనను పక్కనపెట్టకపోతే జగన్ పూర్తిగా నష్టపోతారు. జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారు తప్పులేదు. కానీ ఇటు హిందువో, సంకరజాతో, సైంధవజాతో తెలియని ఇటువంటి వాళ్లు నిరంతరం హిందువులు, హిందూ దేవుళ్లపై బురదచల్లుతుంటే ప్రోత్సహిస్తున్న మీకు-మీ పార్టీకి హిందువులు ఎలా ఓట్లేస్తారో ఆలోచించండి.
కరుణాకర్‌రెడ్డి హయాంలో ఏఏడీ టికెట్లను ఆఫ్‌లైన్‌లో ఎన్ని అమ్ముకున్నాడో, ఎంతకు అమ్ముకున్నాడో ఆయనతో పాటు సభ్యుడిగా పనిచేసిన నాకు తెలుసు. అప్పట్లో నేను రెడ్హాండెండ్గా పట్టుకున్న సంగతి కూడా కరుణాకర్ రెడ్డికి తెలుసు. రాజశేఖర్‌రెడ్డి, జగన్‌కు దగ్గర ఈయనకున్న విలువేంటో నాకు తెలుసు. ఈయన చెప్పుకోవడం కాదు. నాకు తెలుసన్న సంగతి ఆయనకూ తెలుసు. ఇప్పుడూ చెబుతున్నా. అప్పుడూ చెప్పా. భూమన కుంభకోణాలపై నేను చర్చకు సిద్ధం.