– ఆ విషయం ఆయన గుర్తు పెట్టుకోవాలి
– చాలామంది ఎమ్మెల్యేలను చూశామంటున్నారు
– పవ న్ కలవడం లేదంటున్నారు
– కృష్ణయ్యను పవ న్ సరిదిద్దాలి
– అసెంబ్లీలో పీసీబీ వైఫల్యాలపై విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు
అమరావతి: శాసనసభ సాక్షిగా పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు చైర్మన్ పి. కృష్ణయ్య వ్యవహారశైలిపె..ై సొంత పార్టీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమయింది. ఆయనను సరిదిద్దాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌నుద్దేశించి, విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
శాసనసభలో బోండా ఉమ ఏమన్నారంటే..‘‘ ఏదైనా పనిపై ఎమ్మెల్యేలు లెటర్లు పంపితే ఇలాంటి ఎమ్మెల్యేలను 30, 40 సంవత్సరాల్లో చాలామందిని చూశామని కృష్ణయ్య అంటున్నారు. కానీ ఎమ్మెల్యేలు గెలిస్తేనే కృష్ణయ్య చైర్మన్ అయ్యారని గుర్తు పెట్టుకోవాలి. కృష్ణయ్య దగ్గరకు వెళితే పవన్ కల్యాణ్‌కు చెప్పాలి. కానీ ఆయన కలవడం లేదని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు కృష్ణయ్య లాంటి వారిని సరిదిద్దాలి’’ అన్నారు.
అధికారులతో అట్లుంటది: లాబీల్లో ఎమ్మెల్యేల వ్యాఖ్యలు
కాగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ పీసీబీ చైర్మన్ కృష్ణయ్యపై ఆరోపణలు చేయడం.. దానిని డిప్యూటీ సీఎం పవన్ ఖండించడంపై అసెంబ్లీ లాబీలో కూటమి ఎమ్మెల్యేలలో ఆసక్తికరమైన చర్చ జరిగింది.
అధికారులను తెచ్చి పదవులిస్తే ఇలాగే ఉంటుంది. అధికారులు ఏం త్యాగాలు చేశారని పార్టీపై చిత్తశుద్ధి ఉంటుంది? పొలిటికల్ పోస్టింగులను కూడా ఆఫీసర్లకు ఇస్తే ఇలాగే ఉంటుంది. కృష్ణయ్య స్థానంలో పార్టీ నాయకుడికో, ఎమ్మెల్యేకో ఆ పదవి ఇస్తే బోండా ఉమా ఈరోజు అలా మాట్లాడేవారు కాదు కదా? అధికారుల మనస్తత్వానికి పొలిటీయన్ల మనస్తత్వానికి బోలెడు తేడా ఉంటుంది. ఆఫీసర్లు రూల్సు మాట్లాడతారు. కానీ వాళ్లు చేయాల్సింది వాళ్లు చేస్తారు. కానీ మన పొలిటీషియన్లు వచ్చిన ప్రతివారికీ పనులు చేయాలన్న ధోరణితో ఉంటారు. అదే వాళ్లకీ మనకూ తేడా’’ అని ఎమ్మెల్యేలు చర్చించుకోవడం విశేషం.
పవన్ తీరుపై టీడీపీ ఎమ్మెల్యేల ఫైర్
కాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యే బోండా వ్యతిరేక వైఖరి ప్రదర్శించి, పీసీబీ చైర్మన్ కృష్ణయ్యను వెనుకేసుకురావడాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నట్లు, వారి మాటల బట్టి అర్ధమవుతోంది. పైగా బోండా ఉమ వ్యక్తిగత అజెండాతో వ్యవహరించారని ప్రకటన ఇవ్వటాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారు.
బోండా చెప్పిన దాంట్లో అబద్ధాలేమీ లేవని, కృష్ణయ్య రిటైరయినా ఇంకా ఆఫీసరుగానే వ్యవహరిస్తున్నారని వారు స్పష్టం చేశారు. ‘‘ కృష్ణయ్య గారు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కాదు. నామినేటెడ్ చైర్మన్ ఇచ్చారంటే అది పొలిటికల్ పోస్టు అని భావించాలి. అంటే ఆయన టీడీపీ లీడర్‌గా పనిచేయాలి. అంతేగానీ ఇంకా నేను ఆఫీసర్‌ను అనుకుంటే ఎలా? అందుకే కార్పొరేషన్ చైర్మన్లుగా ఆఫీసర్లుగా నియమించకూడదనేది.
వాళ్ల వ ల్ల ఎవరికీ ఉపయోగం ఉండనప్పుడు ఇక ఆ పదవులు వారికివ్వడం ఎందుకు? అసలు వీళ్లు పార్టీకి చేసిందేమిటి? పదిమందితో ఓట్లు వేయించగలిగే శక్తి ఉందా? ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన బాధ్యతలు పూర్తిచేశారన్న కృతజ్ఞతతో వాళ్లకు నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు. ఇకపై అలాంటి వారికి ప్రజలు-ప్రజాప్రతినిధులతో సంబంధం లేని కమిషన్ మెంబర్, చైర్మన్ పదవులిస్తే సరిపోతుందని’’ పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.