అమరావతి: యరపతినేని నిఖిల్ కి విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లి నివాసంలో జన్మదినం సందర్భంగా యరపతినేని నిఖిల్ శనివారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి నారా లోకేష్ యరపతినేని నిఖిల్ కు మిఠాయి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇరువురి మధ్య జరిగిన భేటీ లో నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి నిఖిల్ లోకేష్ కు వివరించారు. ఇటీవల నియోజకవర్గంలో స్త్రీ శక్తి కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారని మంత్రి లోకేష్ అభినందించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి నారా లోకేష్ నిఖిల్ కు మార్గనిర్దేశం చేశారు.