– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి: అందరి సహకారంతోనే కాలుష్యం నివారణ సాధ్యమవుతుందని టీడీపీ దర్శి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. పట్టణంలోని 18వ వార్డులోని జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో శనివారం ” స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ” కార్యక్రమం జరిగింది. డాక్టర్ లక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశానుసారం ప్రతినెల మూడో శనివారం ” స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ” కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. గ్రీన్ ఆంధ్ర సాధన కోసం మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలో మొక్క నాటారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, దర్శి సొసైటీ చైర్మన్ కలువకొలను చంద్రశేఖర్, దర్శి మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, పాఠశాల హెడ్ మాస్టర్ షేక్ ఖాదర్ మస్తాన్, పాల్గొన్నారు.