– బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్
విజయవాడ: సరళీకృత జీఎస్టీ సోమవారం నుంచి అమలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మాట్లాడరాఉ. జీఎస్టీ తగ్గింపు అన్నివర్గాల ప్రజలు కు ఊరట లభించింది.
ప్రాణాధారమైన మందులపై జీఎస్టీ ఫ్రీ చేయడం వైద్యం పేదలకు అందుబాటులోకి తీసుకుని వచ్చి న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం మాట్లాడుతూ కాంగ్రెస్ పేదలను మరింత పేదలు గా చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదల కొనుగోలు శక్తి పెంచేందుకు పన్ను రాయితీలు ఇచ్చారు. దేశంలోని పేదలు నరేంద్ర మోడీ కి రుణపడి ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్ డి విల్సన్, బీజేపీ రాష్ట్ర నేత ఉప్పలపాటి శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు.