అమరావతి: 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శ్రీధర్ చామకూరి మంగళగిరి ఎక్సైజ్ కమిషనరేట్‌లో సోమవారం ఎక్సైజ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో చురుకైన పాత్ర పోషించి, ప్రజలకు మరింత చేరువయ్యారు. ప్రత్యేకించి పరిపాలనా పారదర్శకత, ప్రజా సేవల్లో వేగవంతమైన నిర్ణయాలతో గుర్తింపు పొందారు.
ఎక్సైజ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య విధానాల అమలు, శాఖ పనితీరులో సమన్వయం, పారదర్శకతను పెంపొందించడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. మధ్య నిషేధ చట్టాల సమర్థవంతమైన అమలులో ఆయన అనుభవం దోహదం చేస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ కమిషనరేట్‌లోని అధికారులు , సిబ్బంది నూతన డైరెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.