దసరా నవరాత్రులు మొదలైతే.. ఆత్మలు అక్కడ సంచరించవు.
రోజూ అర్థరాత్రి ఆత్మలతో మాట్లాడే జగన్, గబ్బిలాల తాడేపల్లి బంగళా నుండి పితుహూ.. అని దాని ఐరన్ ఫెన్సింగ్ కూడా అదిరేలా.. ఎంత అరిచినా ఏ ఆత్మా.. రావడంలేదు.
దెబ్బకు భయపడి, బెజవాడకు రాకుండా, యలహంకా ప్యాలస్లోనే “ఆత్మల మీటింగులు” పెట్టుకుని, దుర్గమ్మ దర్శనానికి దూరంగా ఉండిపోయాడు.
అమ్మకు పొంగళ్లు తీసుకెళ్లిన అమరావతి అన్నదాతలను అడ్డుకున్న దుర్మార్గుడు కనకదుర్గమ్మను ఎలా దర్శించగలడు?దసరా అయ్యేవరకు దడ తగ్గదు. ఇటు రాడు.
కానీ.. ఇంతలో సోషల్మీడియాలో కొత్త డ్రామా:
రావణుడు సీతమ్మను చెరపట్టడానికి బిక్షగాడి వేషంలో వచ్చినట్లు, సోషల్మీడియాలో జగన్ దొంగ దండాలతో ఒక క్రియేటివ్ చేసి పదే పదే చూపిస్తూ.. హిందువుల గీత దాటుతారు, చెరబట్టి, నెత్తికెక్కి, మళ్లీ రాములోరి తలలు నరికే, రథాలు తగలబెట్టే రోజుల కోసం తపిస్తున్నట్లున్నాడు.
దుర్గమ్మ వెండి రథంలోని మూడు సింహాలను కూడా లేపేసిన తనా పాపపు పాలన మరిచిపోయేలా ఓటర్ల విశ్వాసాల మీద ఫోటోషాప్ వలలు వేసి, మాయల మంత్రాలతో మత్తెక్కించే ప్రయత్నం ఇది. క్రియేటివ్ పోస్టర్ల వెనుక.. ఓటర్లను చెరపట్టే మారువేష దుర్మార్గుడి డ్రామాను మనమే అర్థం చేసుకోవాలి.
(చాకిరేవు)