చంద్రబాబు నాయుడుతో రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఈడీ ఎంఎస్ ప్రసాద్ మరియు సౌత్ ఇండియా మెంటార్ మాధవరావు సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత, రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి రిలయెన్స్ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది! ముఖేష్ అంబానీకి ఏపీపై ఉన్న అపారమైన నమ్మకానికి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
1. టెక్నాలజీలో ‘బిగ్ లీప్’: AI డేటా సెంటర్ (1 GW)! ఇది కేవలం డేటా సెంటర్ కాదు, ఏపీ ప్యూచర్ బ్రెయిన్! రిలయెన్స్ సంస్థ 1 GW ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన GPUలు, TPUలు, AI ప్రాసెసర్లను ఈ సెంటర్ హోస్ట్ చేస్తుంది. జామ్‌నగర్‌లోని రిలయెన్స్ గిగావాట్-స్థాయి AI డేటా సెంటర్‌కు అనుబంధంగా ఏపీలో ఇది పనిచేస్తుంది. జామ్‌నగర్ + ఏపీ = ఆసియాలోనే అత్యంత బలమైన AI మౌలిక సదుపాయాల నెట్వర్క్! ఇది దేశాన్ని ప్రపంచ AI పటంలో అగ్రస్థానంలో నిలబెడుతుంది.
2. పవర్ఫుల్ ప్లాన్: 6 GWp సౌర విద్యుత్ ప్రాజెక్టు! AI డేటా సెంటర్‌కు శక్తినివ్వడానికి రిలయెన్స్ ఒక మెగా సోలార్ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేయనుంది. ఏపీలో ఏఐ డేటా సెంటర్ కోసం ఏకంగా 6 GWp సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్‌ను రిలయెన్స్ నిర్మిస్తుంది. ఇది గ్రీన్ ఎనర్జీ వినియోగానికి రిలయెన్స్ యొక్క నిబద్ధతను, ఏపీని పునరుత్పాదక ఇంధన కేంద్రంగా మార్చాలనే లక్ష్యాన్ని సూచిస్తుంది.
3. రైతన్నలకు శుభవార్త: గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్! రైతుల నుంచి వినియోగదారుల వరకు… ఆహార రంగంలో కొత్త విప్లవం! కర్నూలులో 170 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను నిర్మించడానికి రిలయెన్స్ సిద్ధమైంది.ఇది ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సౌ కర్యాలతో ఉంటుంది, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తుంది. రిలయెన్స్ చేస్తున్న ఈ భారీ పెట్టుబడుల (AI, సోలార్, ఫుడ్ పార్క్) ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి! టెక్నాలజీ, పవర్, అగ్రికల్చర్… అన్ని రంగాలలోనూ యువతకు ఉపాధి మార్గాలు తెరుచుకోనున్నాయి.