ఈ స్టూడెంట్ అన్న మాటలో ఎంత నిజం? “సోషల్లో నాలుగు ముక్కలు చదివితే వచ్చే జ్ఞానం వేరు. కళ్ళారా చూసి, చేతుల్తో చేసి, నేరుగా నేర్చుకుంటే వచ్చే అనుభవం వేరు. ఇది జీవితాంతం గుర్తుండిపోతుంది!”—అని గర్వంగా చెబుతోంది ఆ విద్యార్థిని. నిజమే! పుస్తకాల పేజీల నుంచి బయటికొచ్చి, అసలైన ప్రజాస్వామ్య పాఠాన్ని ఆ స్టూడెంట్స్ నేర్చుకున్నారు. అసెంబ్లీ రికార్డులు బద్దలు: స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ షో! రాష్ట్రమంతా తీవ్ర పోటీ. లక్షలాది మందిలోంచి కేవలం కొందరికి మాత్రమే ఈ అవకాశం దక్కింది.
ఆ మాక్ అసెంబ్లీని చూస్తే, ఇది రియల్ అసెంబ్లీకి ఏమాత్రం తీసిపోదని అనడం అతిశయోక్తి కాదు. స్పీకర్ స్థానంలో కూర్చున్న విద్యార్థి అయినా, ముఖ్యమంత్రి పాత్ర పోషించిన యువ నాయకుడు అయినా, లేదా మంత్రులు, ఎమ్మెల్యేల సీట్లలో కూర్చున్న ప్రతిభావంతులైనా… అందరూ తమ పాత్రలకు జీవం పోశారు! సాక్షాత్తూ నిజమైన స్పీకర్, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ సభకు హాజరయ్యారు.
వారి కళ్ళ ముందే… విద్యార్థులు అడిగిన ప్రశ్నలు, చర్చించిన అంశాలు, చివరికి వారు అద్భుతంగా చేసి చూపించిన చట్టాల ఆమోదం ప్రక్రియ చూసి, ఆ పెద్దలే అబ్బురపడ్డారు, నివ్వెరపోయారు. ఆ గదిలో కూర్చున్న ప్రతి ఒక్కరికీ భవిష్యత్తు నాయకత్వం పట్ల నమ్మకం పెరిగింది. మాజీ బూతు ప్రజాప్రతినిధులు, బుద్ధి తెచ్చుకునే సమయం! అక్కడ సభలో ఒకవైపు భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలిచే ఆదర్శప్రాయమైన విద్యార్థులు… మరోవైపు, గత ఐదేళ్లలో తరచూ అసెంబ్లీలో హద్దు మీరి ప్రవర్తించిన మాజీ బూతు ప్రజాప్రతినిధులు. వీరిని చూసి ఒక్కసారైనా సిగ్గుపడతారా? ఈ పసికూనల ముందు తలదించుకుని, తమ పద్ధతి మార్చుకుంటారనే చిన్న ఆశ ఇంకా మిగిలే ఉంది. విద్యార్థులు నేర్చిన పాఠాన్ని ఈ నాయకులు కూడా నేర్చుకోవాలి!
