పట్టువదలని విక్రమార్కుని లాగే.. బెయిల్ లేదా స్విమ్స్/ఎయిమ్స్ ఆసుపత్రి బెడ్ కోసం, వెన్నునొప్పి, గుండె నొప్పి, వెరికోస్ వీయిన్స్ అంటూ రకరకాల రోగాల డ్రామాలు నడిపి,ఎట్టకేలకు ఏసీబీ కోర్టు ద్వారా జైల్లోనే గడపడానికి అవసరమైన దిండు, పరుపు, ఫ్యాన్ సాధించినందుకు. జడ్జి ముందు కన్నీరు పెట్టడం, తిరిగి తీసుకు వెళుతూ వ్యాన్ ఎక్కితే మీడియా ముఖంగా వార్నింగ్ ఇవ్వడం, కోర్టులో కరపత్రాలు పంచడం, విచారణలో ఏసీబీ ఆఫీసు ముందే ఇల్లు తీసుకుని దిగి అంతుచూస్తా అనడం, కోర్టులో గోడలను తన్నడం, కేకలు వేయడం… అబ్బో, ఒకటా రెండా! మామూలుగా లేదుగా నీ ఒక్కో డ్రామా! విజయసాయిరెడ్డి ఏదో సరదాగా వైజాగులో గడుపుతుంటే.. పార్టీకి, జగనుకు చేసిన మేలు కూడా మరిచి అవమానించి పంపివేశారు. ఆయన ‘వ్యవసాయానికి వెళుతున్నా’ అని బై బై చెప్పి వెళుతూ.. ముఠా గుట్టును మొత్తం రట్టు చేశాడనుకుంటా. టాప్ బాస్ తప్ప హోల్సేల్ గా లిక్కర్ స్కాంలో అడ్డంగా దొరికారు. ఫ్యానును చూస్తూ.. వేసిన పండగల సెట్టింగులు తలచుకుని పండగ చేసుకో రెడ్డీ. – చాకిరేవు
