తిరుమల నాథుని దివ్య తేజస్సు రాజధాని అమరావతిలో వెల్లివిరియనుంది. వెంకటపాలెంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా , నవంబర్ 27వ తేదీ ఉదయం 10.30 గంటలకు, దివ్యమైన శంకుస్థాపన జరిగింది.
₹260 కోట్లతో రెండు దశల్లో మహా నిర్మాణ యజ్ఞం మహా సంకల్పంతో, భక్తుల సౌలభ్యం కోసం రూ.260 కోట్లతో ఈ బృహత్తర అభివృద్ధి కార్యక్రమం రూపుదిద్దుకోనుంది.
మొదటి దశ పనులు (రూ. 140 కోట్లు)
* ప్రాకార నిర్మాణం: రూ. 92 కోట్లతో ఆలయం చుట్టూ దివ్యమైన ప్రాకారం.
* మహా రాజగోపురం: ఏడంతస్తుల సువిశాల రాజగోపురం, స్వామివారి కీర్తిని దశ దిశలా చాటేలా నిర్మాణం.
* మండపాల శ్రేణి: ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం వంటి భక్తిభావానికి అద్దం పట్టే మండపాలు.
* ఆంజనేయస్వామి ఆలయం: శ్రీవారి సేవలో భాగంగా ప్రియ భక్తుడైన ఆంజనేయస్వామివారికి ప్రత్యేక ఆలయం.
* పుష్కరిణి & ఫ్లోరింగ్: పవిత్ర పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్‌తో ఆలయ ప్రాంగణం మరింత శోభాయమానం.
రెండో దశ పనులు (రూ. 120 కోట్లు)
* శ్రీవారి మాడ వీధులు: తిరుమల తరహాలో భక్తులు ప్రదక్షిణ చేసేందుకు వీలుగా మాడ వీధులు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం.
* అన్నదాన కాంప్లెక్స్: నిత్య అన్నదానానికి అనువుగా సువిశాలమైన భవనం.
* యాత్రికుల వసతి: విశ్రాంతి భవనం, అర్చక-సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్ హౌస్.
* ఇతర సౌకర్యాలు: పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్.
ఆలయ నిర్మాణం మొదటి విడత ఇప్పటికే పూర్తవగా, ఈ శంకుస్థాపన అనంతరం రెండు, మూడు విడత పనులు ఊపందుకోనున్నాయి. త్వరలోనే నాలుగో విడత పనుల కోసం టెండర్లను కూడా పిలవనున్నారు.
గతంలో కుదించిన ఆలయ నిర్మాణం: కూటమి ప్రభుత్వంతో మళ్లీ వైభవం 2019కి పూర్వం, టీడీపీ ప్రభుత్వం కృష్ణా నది తీరాన, తిరుమల స్థాయిలో 25.417 ఎకరాల్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించింది. కానీ, గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ఈ పవిత్ర కార్యంపై గ్రహణం పట్టింది. కేటాయించిన స్థలంలో కోత విధించడమే కాకుండా, విస్తరణ పనులను రద్దు చేసింది. కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే, ధర్మ పునరుద్ధరణ సంకల్పంతో, రాజధాని అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విస్తరణకు మళ్లీ శ్రీకారం చుట్టింది. ఇది నిజంగా భక్తులందరికీ అత్యంత శుభప్రదమైన వార్త! శ్రీవారి దర్శన భాగ్యం త్వరలోనే సమకూరాలని ప్రార్థిద్దాం! ఓం నమో వేంకటేశాయ!

