అమరావతి: ప్రతి ఆంధ్రుడూ గర్వపడేలా గుర్తు చేసిన మన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్! బెనారస్ హిందూ యూనివర్సిటీలో మన ఆంధ్ర విద్యార్థుల అద్భుతమైన సైన్స్ ప్రతిభ గురించి మొదలుకొని, టిబెట్లో మన ఆచార్య నాగార్జునుడి రసాయన శాస్త్ర ప్రావీణ్యం వరకు… మన ఆంధ్రుల గొప్పతనాన్ని గుర్తు చేస్తూ హృదయానికి హత్తుకునేలా ఆమె ప్రసంగించారు.
అంతేకాక, అమరావతికి బ్యాంకుల రాకతో పాటు రాబోతున్న మరో ఖగోళ అద్భుతం గురించి ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గారు వివరిస్తుంటే… ప్రతి ఆంధ్రుడికీ గర్వంతో ఆనందబాష్పాలు ఆగవు! సైన్స్ రంగంలో మన ఆంధ్రా విద్యార్థులపై మన కోడలు నిర్మలమ్మ పెట్టుకొన్న విశ్వాసాన్ని స్పష్టం చేసిన ఈ సమావేశంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేశ్ … నిత్య విద్యార్థుల్లా అత్యంత శ్రద్ధగా ఆమె మాటలను ఆలకించారు. ఈ సందర్భంగా వారు పదే పదే చప్పట్లు చరుస్తూ కనిపించారు.